మరి ముఖ్యంగా మార్నింగ్ వాక్ వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి . అంతేకాదు ఈవినింగ్ వాక్ కూడా చాలా చాలా మంచిది . అయితే జపాన్ కొత్తగా "ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్" అనే పద్ధతిని తీసుకొచ్చింది . దీనివల్ల ఇంకా ఇంకా ప్రాఫిట్స్ ఉన్నాయి అంటున్నారు డాక్టర్లు . చాలామంది బరువు తగ్గడానికి హెల్తీగా ఉండడానికి వేగంగా నడిచేస్తూ ఉంటారు . అయితే ఆ కారణంగా కొన్నిసార్లు కొందరి బాడీలు ఆ కండిషన్ తట్టుకోలేక హార్ట్ ఎటాక్ వస్తూ ఉంటాయి. మనం చాలా సందర్భాలలో చూసాం . బరువు ఎత్తేటప్పుడు హార్ట్ ఎటాక్. వేగంగా నడిచేటప్పుడు హార్ట్ ఎటాక్. డాన్స్ వేసేటప్పుడు హార్ట్ ఎటాక్ వచ్చి మరణించారు అన్న వార్తలు విన్నాం.
ఈ క్రమంలోనే జపాన్ కొత్త పద్ధతి "ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్" ను తీసుకొచ్చింది. బరువు తగ్గడానికి గంటల తరబడి ధ్రేడ్ మిల్ పై పరిగెత్తాల్సిన పనేలేదు . ఈ పద్ధతిని కొద్దిగా ఫాలో అయితే చక్కగా బరువు తగ్గిపోవచ్చు . హెల్దిగా ఉండొచ్చు కొద్ది సేపు వేగంగా నడవాలి . కొద్దిసేపు నెమ్మదిగా నడవాలి . దీని ద్వారా బ్రీతింగ్ ప్రాబ్లం రాదు. మన బాడీ కూడా కంట్రోల్ లో ఉంటుంది. జపాన్ కు చెందిన డాక్టర్ హీరో షీ నూస్ శాస్త్రవేత్త దీనిని కనిపెట్టారు . ఈ పద్ధతి ప్రకారం మూడు నిమిషాలు వేగంగా నడవాలి (మీరు ఎంత వేగంగా నడవగలరో అంత మాత్రమే ట్రై చేయండి).
ఆ తర్వాత మూడు నిమిషాలు నెమ్మదిగా నడవాలి . ఇలా 30 నిమిషాలు నడవాలి. ఆ తర్వాత ఇదే పద్ధతిని ఐదు సార్లు రిపీట్ చేయాలి. దీని వల్ల మీ గుండె బలంగా మారుతుంది. కాళ్లు గట్టిగా ఉంటాయి . ఇంకా మీరు చిన్నవాళ్ళు అయినట్లు లుక్స్ లో కనిపిస్తారు. మామూలుగా చాలా మంది మూడు నాలుగు గంటలు గ్రౌండ్లో పరిగెడుతూనే ఉంటారు. దానికంటే ఇది చాలా చాలా బెటర్ . అంతేకాదు ఆయాసం కూడా ఎక్కువగా రాదు. వయసు పైబడిన వాళ్లు కూడా ఈ టెక్నిక్ ఫాలో అవ్వచ్చు మీ శరీరంలోని కొవ్వు క్రమక్రమంగా మొత్తం కరిగిపోతుంది . ఇక గుండె ఆరోగ్యంగా ఉంటుంది . మీకు ఎటువంటి రోగాలు రావు అంటున్నారు డాక్టర్లు.
నోట్: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఒక్కోక్కరి బాడీ తీరు వేరే గా ఉంటుంది. మీరు ఏదైనా పాటించేటప్పుడు ఒక్కసారి డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం అని గుర్తు పెట్టుకోండి..!!