
1. మూత్రంలో రక్తం :
మూత్రంలో రక్తం పడడం కిడ్నీ క్యాన్సర్ యొక్క ముఖ్యమైన ప్రారంభ సంకేతం. దీనిని హీమాట్యూరియా అంటారు. క్యాన్సర్ కణితులు మూత్రపిండాలు లేదా మూత్రవ్యవస్థలోని చిన్న రక్తనాళాలను దెబ్బతీయడం వల్ల రక్తం మూత్రంలోకి చేరుతుంది. ఇది కొద్దిగా అయినా, ఎక్కువగా అయినా కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
2. వెన్నునొప్పి:
కిడ్నీ క్యాన్సర్ వల్ల నిరంతర వెన్నునొప్పి లేదా నడుమునొప్పి కలుగుతుంది. ముఖ్యంగా రక్తం మూత్రంలో కనిపించడం, వెన్నునొప్పి కలగడం రెండూ కలిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లడం మంచిది.
3. బరువు తగ్గడం
వ్యాయామం చేయకపోయినా, డైటింగ్ చేయకపోయినా వేగంగా బరువు తగ్గితే జాగ్రత్త. కిడ్నీ క్యాన్సర్ జీవక్రియపై ప్రభావం చూపి, బరువు గణనీయంగా తగ్గేలా చేస్తుంది.
4. నడుము దిగువన గడ్డలు:
నడుము దిగువన లేదా పక్కటెముకల దగ్గర గడ్డలు, వాపులు కనిపిస్తే అది కూడా కిడ్నీ క్యాన్సర్ సంకేతం కావచ్చు. అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ వంటి పరీక్షల ద్వారా ఆ గడ్డల స్వరూపాన్ని వైద్యులు నిర్ధారిస్తారు.
5. అలసట, నీరసం:
తగినంత విశ్రాంతి తీసుకున్నా, పని చేయకపోయినా అలసటగా అనిపించడం, నీరసం కలగడం కూడా కిడ్నీ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు.
కిడ్ని క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
కొన్ని అలవాట్లు మార్చుకోవడం, జీవనశైలిలో జాగ్రత్తలు పాటించడం ద్వారా దీనికి గురయ్యే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
కిడ్నీ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పొగ తాగే అలవాటు మానుకోవాలి :స్మోకింగ్ కిడ్నీ క్యాన్సర్‌కు ప్రధాన కారణాల్లో ఒకటి. పొగ తాగే వారు ఇతరుల కంటే 2–3 రెట్లు ఎక్కువ రిస్క్‌లో ఉంటారు.
సరైన బరువును కాపాడుకోవాలి: అధిక బరువు వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో బరువును కంట్రోల్‌లో ఉంచాలి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి: ఎక్కువగా కూరగాయలు, పండ్లు, పప్పులు, గింజలు తీసుకోవాలి.
అధిక కొవ్వు, వేయించిన పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఫుడ్ (జంక్ ఫుడ్) తగ్గించాలి.
రక్తపోటు కంట్రోల్‌లో ఉంచుకోవాలి: హై బీపీ ఉన్నవారికి కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తాయి. క్రమం తప్పకుండా బీపీ చెక్ చేయించుకోవాలి.
మందులు జాగ్రత్తగా వాడాలి: ఎక్కువ కాలం పాటు నొప్పి నివారణ మాత్రలు (ఫైంకిల్లెర్స్) వాడటం కిడ్నీలకు హానికరం. కాబట్టి డాక్టర్ సూచన లేకుండా వాటిని రెగ్యులర్‌గా వాడకూడదు.
నీరు ఎక్కువగా తాగాలి:శరీరంలో టాక్సిన్స్ బయటికి వెళ్లడానికి నీరు సహాయపడుతుంది. రోజుకు కనీసం 2–3 లీటర్ల వరకు నీరు తాగడం మంచిది.