
చికెన్.. లీన్ ప్రోటీన్‌కి బెస్ట్ సోర్స్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చికెన్ బ్రెస్ట్‌లో ప్రోటీన్ ఎక్కువగా, కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు, జిమ్ చేసే వారికి చికెన్ సరైన ఆప్షన్. మటన్ విషయానికి వస్తే.. ఇందులో ప్రోటీన్ హెవీగా ఉంటుంది. మరియు కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. అధిక మోతాదులో మటన్ తింటే బరువు పెరగడానికి కారణమవుతుంది.
చికెన్ లో బి-విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెటబాలిజం రెటును పెంచడానికి, నర్వస్ సిస్టమ్‌ను బలోపేతం చేయడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే ఐరన్, జింక్, విటమిన్ బి12 వంటి పోషకాలకు మటన్ గొప్ప మూలం. రక్తహీనత నుంచి త్వరగా రికవరీ అయ్యేందుకు మటన్ తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
చికెన్ లో తక్కువ క్యాలరీలు, తక్కువ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అందుకే చికెన్ హార్ట్ హెల్త్‌కి ఫ్రెండ్లీగా ఉంటుంది. మటన్ లో సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ. అందువల్ల రెగ్యులర్‌గా లేదా అధిక మొత్తంలో మటన్ తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి గుండెకు ముప్పుగా మారుతుంది. ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే.. చికెన్, మటన్ రెండూ ఆరోగ్యకరమే.
అయితే బీపీ, హార్ట్ సమస్యలున్నవారు చికెన్ తినడం బెస్ట్. రక్తహీనత, బలహీనత ఉన్నవారు, ఇమ్యూనిటీని పెంచుకోవాలని భావించేవారు మటన్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఫిట్‌నెస్ లవర్స్, వెయిట్ లాస్ అయ్యేందుకు ట్రై చేసేవారు చికెన్ తీసుకోవడం మంచిది. మసిల్ బిల్డింగ్ కు ప్రయత్నించేవారికి రెండూ ప్రోటీన్ ఇస్తాయి. కానీ చికెన్ తేలికగా డైజెస్ట్ అవుతుంది.
ఇకపోతే చికెన్ అయినా, మటన్ అయినా తినే విధానం కూడా ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఉడికించి, గ్రిల్ చేసి, తక్కువ మసాలాలతో తింటే చికెన్ కానీ, మటన్ కానీ హెల్త్‌కి మేలు చేస్తాయి. అలా కాకుండా ఫ్రైస్, కర్రీల్లో ఎక్కువ ఆయిల్ వాడితే రెండూ హెల్త్ రిస్క్ అవుతాయి.