గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో డిసెంబ‌ర్ 10వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం



ముఖ్య సంఘటనలు

1973: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి సారిగా విధింఛిన రాష్ట్రపతి పాలనకు ఆఖరి రోజు (1973 జనవరి 10 నుంచి 1973 డిసెంబర్ 10 వరకు).
1973: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరవ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ప్రమాణ స్వీకారం (10 డెసెంబర్ 1973 నుంచి 1978 మార్చి 6 వరకు).
1955: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
2003: తెలుగు వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ప్రారంభం.
2004: టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారునిగా అనిల్ కుంబ్లే అవతరించాడు.

ప్ర‌ముఖుల జననాలు

1877: రావిచెట్టు రంగారావు, తెలంగాణలో విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన వ్యక్తి. (మ.1910)1908 సంవత్సరంలో మూసీనదికి భయంకరమైన వరదలు వచ్చి హైదరాబాదు నగరాన్ని ముంచివేశాయి. ఎంతో ధన, ప్రాణనష్టం జరిగింది. అలాంటి ఆపదకాలంలో రంగారావు హైదరాబాద్ నగర ప్రజలకు సహాయపడి, నిరాశ్రయులైన వారికి, వసతి సౌకర్యాలు కల్పించారు. వీరు ఎంతోమంది పేద విద్యార్థులను తన ఇంట్లో వుంచుకొని ఉన్నత చదువులు చెప్పించారు. అలా వారి సహాయంతో పైకివచ్చినవారిలో ఆదిరాజు వీరభద్రరావు గారొకరు. రావిచెట్టు రంగారావు గారి జీవిత చరిత్రను ఆదిరాజు వీరభద్రరావు 1910 లో 'జీవిత చరితావళి' అనే గ్రంథంలో కథనం చేశారు. ఇది విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి పక్షాన 1911 లో ప్రచురితమైంది.
1878: చక్రవర్తి రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ (మ.1972).
1880: కట్టమంచి రామలింగారెడ్డి, సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (మ.1951)
1897: సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, తెలుగు పండిత కవి (మ.1982).
1902: ఎస్.నిజలింగప్ప, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు.
1902: ఉప్పల వేంకటశాస్త్రి, ఉత్తమశ్రేణికి చెందిన కవి. (మ.1976)
1920: గంటి కృష్ణవేణమ్మ, తెలుగు కవయిత్రి.
1948: రేకందార్ ఉత్తరమ్మ, తెలుగు రంగస్థల, సినిమా నటి.
1952: సుజాత, దక్షిణ భారత సినిమా నటి. (మ.2011)
1954: జలీల్ ఖాన్, విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు.

ప్ర‌ముఖుల మరణాలు

1896: ఆల్‍ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త (జ.1833).
1990: తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి, లలితా త్రిపుర సుందరీ ఉపాసకుడు (జ.1896).
2013: రావెళ్ళ వెంకట రామారావు, తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు (జ.1927).


పండుగలు, జాతీయ దినాలు

మానవ హక్కుల దినోత్సవం
ప్రపంచ జంతువుల హక్కుల దినం

మరింత సమాచారం తెలుసుకోండి: