ప్రస్తుతం ప్రతి వ్యక్తి తన ఆరోగ్యం గురించి శ్రద్ద వహిస్తుస్తున్న నేపధ్యంలో దీర్ఘకాలిక వ్యాధుల బాట పట్టకుండా చిన్నచిన్న రెమిడీస్ తో వీలైనంత వరకు అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండటానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం బార్లీ వాటర్ వలన వచ్చే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
health tips in telugu
ప్రతిరోజు మన ఆహార అలవాట్లలో బార్లీ వాటర్ ను  చేర్చుకోమని అనేకమంది వైద్యులు సలహాలు ఇస్తున్నారు. బార్లీ అనే హోల్ గ్రెయిన్ ను ఉపయోగించి బార్లీ వాటర్ ను తయారుచేస్తారు. శాస్త్రవేత్తల పరిశోధనలో ఈవాటర్ వల్ల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. ఆస్త్మా, ఒబెసిటీ, ఆర్తరైటిస్, అనీమియా, ఇంపొటెన్సీ వంటి సమస్యలను బార్లీ వాటర్ ఎంతో ప్రయోజనాన్ని ఇస్తుందని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. 
health tips in telugu
దీనికితోడు ఇందులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. బార్లీ వాటర్ అనేది సహజమైనది. దీనిని వాడటం ద్వారా కిడ్నీ స్టోన్స్ సమస్య నుంచి విముక్తిని పొందవచ్చు అని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు. బార్లీ వాటర్ వల్ల నేచురల్ పద్దతిలో కిడ్నీ స్టోన్స్ సమస్య నుంచి రక్షణ లభిస్తుంది. అదేవిధంగా రోజూ డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లెమ్స్, యూరినరీ ప్రాబ్లమ్ తొలిగిపోతాయి. 
health tips in telugu
బార్లీ నీళ్లు అనేది హెల్త్ డ్రింక్ కాబట్టి ఇది బ్లాడర్ పై ప్రెషర్ ని కలిగించడంతో పాటు ఇందులో లభించే పోషకాలు స్టోన్స్ ను కరిగించేందుకు తోడ్పతాయి. తద్వారా, స్టోన్ సైజ్ మారుతుంది. దానితో శరీరం నుంచి స్టోన్స్ త్వరగా బయటికి వెళ్ళిపోతాయి. బార్లీ నీళ్లలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి యూరిన్ లో కేల్షియం కంటెంట్ యొక్క విసర్జనను తగ్గిస్తుంది. ఈవిధంగా ఎన్నో ప్రయోజనాలు కలిగిన బార్లీ వాటర్ ను తీసుకోమని ప్రస్తుతం అలోపతి వైద్యులు కూడ సలహాలు ఇస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: