ఆ టెస్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది. అయితే టేస్టే కాదు నూనెను అవసరానికి మించిన రేంజ్ లో వాడితే దానికి వచ్చే జబ్బులు కూడా ఆరేంజ్ లోనే ఉంటాయి. చిన్న వయసులోనే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు హార్ట్ అటాక్ కారణంగా మరణిస్తున్నారు అంటే దానికి ప్రధానమైన కారణం ఈ ఆయిల్ అనేది చెప్పాలి. బ్రేక్ ఫేస్ట్ లోకి పూరి అంటూ లంచ్ లోకి వడ అంటూ స్నాక్స్ కి బజ్జి అంటూ డిన్నర్ లోకి ఆలు పరాటా అంటూ అన్ని రకరకాలుగా చేసుకొని తింటూ ఉంటారు కొంతమంది . అయితే అంతంత ఆయిల్ వాడిన పదార్థాలను తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటూ డాక్టర్లు చెప్పుకొస్తూనే ఉన్నారు .
మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే పిల్లలు హార్ట్ ఎటాక్ కారణంగా మరణిస్తూ వస్తున్నారు. అయితే దీన్నంటతటికీ కారణం నూనె. మనం మన జీవన శైలిలో కారణంగా ఇంట్లో నూనె వాడకం విపరీతంగా పెరిగిపోయింది అంటూ గణాంకాలు తెలియజేస్తున్నాయి . కాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సిఫారసుల ప్రకారం ఒక మనిషి రోజుకి ఎంత నూనె తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ఒక్కో మనిషి ఏడాదికి సగటున 23.5 లీటర్ల నూనె వాడేస్తున్నారు అంటూ అధ్యయనలలో బయటపడింది. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్.. ప్రకారం మనిషి రోజుకి 20 మిల్లీలీటర్ల నూనె (అంటే నాలుగు టేబుల్ స్పూన్ల మించకుండా) చూసుకోవాలి అంటే ఇంట్లో నలుగురు సభ్యులు ఉన్న క్రమంలో నెలకు కనిష్టంగా 2.5 లీటర్లు లేదంటే మూడు లీటర్లు అంటే అంతకుమించి ఎట్టి పరిస్థితులను ఎక్కువ నూనె వాడకూడదు. మరీ ముఖ్యంగా నూనెలో దేవిన పదార్థాలను .. నూనెలో వాడ్చిన పదార్థాలను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది . అది గుండె సంబంధిత సమస్యలను ఎక్కువగా పెంచేస్తుంటాయి. నూనె కోసం అధిక మొత్తంలో ఖర్చు చేయడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకున్న వాళ్ళమవుతాము అంటూ డాక్టర్ లు హెచ్చరిస్తున్నారు..!