
వ్యక్తిగత సమాచారంతోపాటు కొన్ని వేడుకలు ఇతర జ్ఞాపకాలను ముఖ్యమైన వారితో పంచుకోవడానికి వాట్సప్ లో స్టేటస్ అనేదాన్ని గతంలో తీసుకొచ్చిన విషయం అందరికీ తెలుసు. ఏ ముహూర్తనా తీసుకొచ్చిందో గానీ అప్పటినుంచి ఇంట్లో ఫంక్షన్ అయినా లేదు మనకి ఏదైనా ఇంపార్టెంట్ రోజైన అది మంచి అయినా చెడు అయినా అని కూడా వాట్సప్ స్టేటస్ లో పెట్టేస్తున్నారు జనాలు. నిద్రలేచిన మొదలు రాత్రి పడుకునే వరకు మన కాంటాక్ట్ లో ఉండే వాళ్ళు స్టేటస్ లను ఎలా పెడుతూ వస్తూ ఉంటారు మనం గమనించొచ్చు . అయితే ఇప్పటివరకు కేవలం ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేసే వీలు ఉండేది స్టేటస్ లో. తాజాగా వాట్సాప్ తీసుకొచ్చిన అప్డేట్ తో స్టేటస్ ఇమేజ్ లల్లో గరిష్టంగా ఆరు ఇమేజ్లను అప్లోడ్ చేసేలా వెసూలు బాటు కల్పించింది. ఇది వాట్సప్ స్టేటస్ పెట్టుకునే వాళ్ళకి మంచికి కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పాలి .
చాలామంది వాట్సాప్ స్టేటస్ లు పెట్టడం అనేది ఒక వ్యసనంలా మారిపోయింది . మరీ ముఖ్యంగా ఇంట్లోని కొందరు అలాంటివాళ్ళని వాట్సప్ స్టేటస్ పిచ్చోళ్ళు అంటూ కూడా పిలుస్తూ ఉంటారు . ప్రతి విషయాన్ని వాట్సాప్ స్టేటస్ లో పెట్టి అందరికీ తెలిసేలా చేస్తూ ఉంటారు . అలాంటి వాళ్లకి ఇప్పుడు వాట్సప్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. స్టేటస్ ద్వారా యూసర్లు మరింత సృజనాత్మకంగా తమ ఇమేజ్ లను ఇతరులతో పంచుకునేందుకు ఇది బాగా ఉంటుంది . కొత్తగా లేఅవుట్ లు.. మ్యూజిక్ లు.. ఫోటో స్టిక్కర్ వంటి ఫీచర్లతో ఆడ్ యువర్ ఆప్షన్ ద్వారా ఇమేజ్లను ఆడ్ చేసుకునే వెసులబాటు కూడా కల్పించింది . అయితే యూజర్లు ఇమేజ్ అన్నిటినీ ఒకే ఫ్రేమ్లో ఎలా చూపించాలి అనుకుంటున్నారో సరిగ్గా అదేవిధంగా అమర్చుకుంటే చాలా చక్కగా ఉంటుంది . దీనికి అదనంగా మ్యూజిక్ యాడ్ చేసుకునే వెసులుబాటు కల్పించడం మరింత ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అని చెప్పొచ్చు. దానితోపాటు మ్యూజిక్ స్టిక్కర్ను కూడా ఉపయోగించుకోవచ్చు . అయితే ఈ కొత్త ఫీచర్ ని ఉపయోగించాలి అంటే వాట్సాప్ ను అప్డేట్ చేసుకోవాల్సిందే అన్న విషయం గుర్తుంచుకోవాలి..!