నెయ్యి గురించి ఆయుర్వేదంలో చెప్పిన నిజాలు, విశేషాలు చాలా అద్భుతంగా ఉంటాయి. నెయ్యి అంటే కేవలం కొవ్వు కాదని, అది ఓ ఔషధం అని ఆయుర్వేదం చెబుతుంది. ఇది శరీరానికి, మనస్సుకు, చర్మానికి, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా గావు నెయ్యి ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఘృతం అనేది ఔషధ గుణాలు కలిగిన ఆహారం.  ఘృతం శరీరానికి శక్తిని, స్థిరత్వాన్ని, బుద్ధి పద్యతను ఇస్తుంది. వాతాన్ని శమింపజేస్తుంది. పిత్తాన్ని సమతుల్యం చేస్తుంది. కఫాన్ని తక్కువ చేస్తుంది.  దీని వల్ల శరీరం ఆరోగ్యంగా, శక్తివంతంగా మారుతుంది. ఆయుర్వేదం ప్రకారం నెయ్యి అగ్ని ని ఉత్తేజితం చేస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. అజీర్తి, వాంతులు, వాయువు సమస్యలు తగ్గుతాయి. ప్రాణశక్తి  పెరుగుతుంది. మేధ, బుద్ధి, జ్ఞాపకశక్తికి ఉపకరిస్తుంది.

ఘృతం మానసిక స్థితిని బలపరిచే శ్రేష్ఠమైన పదార్థంగా ఆయుర్వేదంలో పేర్కొంటారు. ఇది ధీరత, ఓర్పు, ఏకాగ్రతను పెంచుతుంది. విద్యార్థులు, పని ఒత్తిడిలో ఉన్నవారు, వృద్ధులకు నెయ్యి మేలు చేస్తుంది. వయస్సు పెరిగినా శరీర కణాలు నవీకరించబడతాయి. ఘృతం జీవకణాలను పోషించి పాతవాటిని తొలగించి కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది. చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా ఉంటుంది. శక్తి, ఓర్పు పెరుగుతుంది. ఘృతం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. నెయ్యిని తీసుకోవడం ద్వారా చూపు మెరుగవుతుంది. "తర్పణం" అనే కంటి చికిత్సలో నెయ్యిని ఉపయోగిస్తారు.

  ఘృతం శరీరంలోని కండరాలు, జాయింట్లు మరియు నాడీ వ్యవస్థకు సహజమైన తేమనిస్తుంది. కీళ్ల నొప్పులు, కడుపులో ఉండే సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం నివారించడంలో కూడా నెయ్యి బాగా పనిచేస్తుంది.  ఐర, బ్రాహ్మి, అశ్వగంధ, తృఫల వంటి ఔషధాలను కలిపి తయారు చేసిన ఘృతాలు. మానసిక శక్తిని బలోపేతం చేస్తాయి. నరాల బలహీనతలకు ఉపశమనం ఇస్తాయి. పిత్త సంబంధిత సమస్యలకు బాగా పనిచేస్తాయి. 1 స్పూన్ నెయ్యి + గోరువెచ్చటి నీరు,  జీర్ణక్రియ బాగుంటుంది, డిటాక్స్, అన్నం వేడిగా ఉన్నప్పుడు 1 స్పూన్ నెయ్యి కలిపి తినడం ఉత్తమం. పాచి అన్నంలో కలిపి రాత్రి తినవచ్చు – మలబద్ధకం తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: