
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వివాహేతర సంబంధాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇది సామాజిక, కుటుంబ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రత్యేకంగా నగరాల్లో ఈ సంబంధాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇది ఆధునిక జీవనశైలి, సాంకేతిక ప్రగతి, ఒంటరితనం, దంపతుల మధ్య భావోద్వేగాల లోపం లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛతో కొందరు వ్యక్తులు వివాహేతర సంబంధాల్లో పడటం ద్వారా తమ జీవితాలను మాత్రమే కాదు, తమ కుటుంబాల భవిష్యత్తును కూడా గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇటీవల "అశ్లీ మాడిసన్" అనే ప్రముఖ డేటింగ్ సంస్థ దేశవ్యాప్తంగా వివాహేతర సంబంధాలపై ఒక అధ్యయనం జరిపింది. ఈ అధ్యయనంలో వివిధ నగరాల నుంచే కాకుండా, ప్రజల ఆచారాలు, ఆన్‌లైన్ చాట్స్, డేటింగ్ యాప్‌ల వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అందులో భారతదేశంలో వివాహేతర సంబంధాలు అధికంగా ఉన్న టాప్ 20 ప్రాంతాల జాబితాను ప్రకటించారు.
ఈ నివేదికలో దేశంలోని అత్యధిక వివాహేతర సంబంధాలు ఉన్న ప్రాంతంగా తమిళనాడులోని కాంచీపురం నిలవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, గురుగ్రామ్ వంటి అగ్రశ్రేణి మెట్రో నగరాలను దాటి కాంచీపురం అగ్రస్థానంలో నిలవడం విశేషంగా మారింది. ఇది అక్కడి సామాజిక పరిణామాలు, వ్యక్తిగత జీవితాలపై ఆలోచనకు దారితీసే అంశంగా మారింది. దక్షిణ భారత నగరాలు తక్కువ సంఖ్యలో ఈ జాబితాలో ఉన్నాయి. బెంగళూరు 9వ స్థానంలో ఉండగా, హైదరాబాద్ 18వ స్థానంలో నిలిచింది. తమిళనాడు కాంచీపురం తలపెట్టిన మినహా ఇతర దక్షిణాది ప్రాంతాలు వెనుకబడ్డాయి. డిజిటల్ యుగంలో డేటింగ్ యాప్స్, సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫార్మ్స్ వివాహేతర సంబంధాలను ప్రోత్సహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
వివాహేతర సంబంధాలలో దేశ వ్యాప్తంగా టాప్ 20 నగరాల జాబితా ఇలా ఉంది. 1. కాంచీపురం 2. సెంట్రల్ ఢిల్లీ 3. గుర్గావ్ 4. గౌతమ్ బుద్ధనగర్ 5. నైరుతి ఢిల్లీ 6. డెహ్రాడూన్ 7. తూర్పు ఢిల్లీ 8. ఫుణే 9. బెంగళూరు 10. దక్షిణ ఢిల్లీ 11. చండీగఢ్ 12. లక్నో 13. కోల్ కతా 14. పశ్చిమ ఢిల్లీ 15. కామరూప 16. వాయువ్య ఢిల్లీ 17. రాయగఢ్ 18. హైదరాబాద్ 19. ఘజియాబాద్ 20. జైపూర్
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు