గుండెపోటు అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. గుండెపోటు వచ్చే ముందు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఈ లక్షణాలను ముందుగానే గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. గుండెపోటుకు ప్రధాన లక్షణం ఛాతీలో తీవ్రమైన నొప్పి. ఈ నొప్పి ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపుగా వస్తుంది. ఈ నొప్పి ఒత్తిడి, బిగుతు లేదా మంటగా అనిపిస్తుంది. ఇది కొన్ని నిమిషాల పాటు ఉండి మళ్లీ వస్తుంటుంది.

ఛాతీ నొప్పి భుజాలు, చేతులు (ముఖ్యంగా ఎడమ చేయి), మెడ, దవడ లేదా వెన్నులోకి వ్యాపిస్తుంది. ఈ నొప్పి ఒకోసారి ఛాతీలో కాకుండా ఈ భాగాల్లో మాత్రమే రావచ్చు. చిన్న పని చేసినా కూడా శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం గుండెపోటు లక్షణాల్లో ఒకటి. ఛాతీ నొప్పితో పాటు ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఎటువంటి కారణం లేకుండానే విపరీతంగా చమటలు పట్టడం కూడా ఒక లక్షణం. శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నప్పటికీ  చెమటలు వస్తాయి.

కొంతమందికి గుండెపోటు వచ్చే ముందు వికారం లేదా వాంతులు అయ్యే అవకాశం ఉంది. ఈ లక్షణాలు తరచుగా అజీర్తిగా అనిపిస్తాయి.  కారణం లేకుండానే అకస్మాత్తుగా తల తిరగడం, కళ్లు మసకబారడం బలహీనంగా అనిపించడం కూడా గుండెపోటు సంకేతాలు కావచ్చు.

 ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా గుండెపోటు రిస్క్ నుంచి తప్పించుకునే అవకాశాలు అయితే ఉంటాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: