
నమితా హోమ్స్ సంస్థ హైటెక్స్ చేరువలో 360 లైఫ్ అనే ప్రాజెక్టును నిర్మిస్తోంది. దీనికి చెందిన కొందరు షేర్ హోల్డర్లు జీహెచ్ఎంసీ పునఃఅనుమతిని ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టు telangana high court లో కేసు దాఖలు చేశారు. ఈ నిర్మాణంలో సుమారు పద్దెనిమిది లోపాలను గమనించిన జీహెచ్ఎంసీ.. వాటిని సరిదిద్దకుండా తిరిగి అనుమతిని ఎలా మంజూరు చేసిందంటూ ప్రశ్నించారు. దీనికి ghmc జీహెచ్ఎంసీ సమాధానమిస్తూ.. ఒకవేళ నిర్మాణ లోపాల్ని సవరించకపోతే, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేసే సమయంలో తగిన చర్యల్ని తీసుకుంటామని తెలియజేసింది.
అయితే, దీనిపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. అలాంటి చర్యల వల్ల అక్రమ నిర్మాణాల్ని ప్రోత్సహించినట్లు అవుతుందని స్పష్టం చేసింది. ముందుగా జారీ చేసిన నిర్మాణం నిలిపివేయమనే ఆదేశం గురించి రీవాలిడేషన్ లేఖలో ఒక్కసారి కూడా ఎందుకు ప్రస్తావించలేదని బెంచి ప్రత్యేకంగా ప్రశ్నించింది. ఈ మొత్తం నిర్మాణంపై స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు