
మట్టితో చేసిన వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటిలోని జీవులకు ప్రమాదం జరుగుతుంది. కానీ మట్టి వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తే అవి తొందరగా నీటిలో కలిసిపోతాయి. దీని వల్ల నీరు కలుషితం కాదు. అందువల్ల, జలచరాలకు ఎలాంటి హాని ఉండదు. ఇవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
మట్టి వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో అనేక రకాల రసాయనాలు, విషపూరితమైన రంగులు ఉంటాయి. వీటి వల్ల పర్యావరణానికి చాలా హాని జరుగుతుంది. కానీ మట్టి విగ్రహాల తయారీలో ఎలాంటి రసాయనాలు ఉండవు. అంతేకాకుండా, దీనిని నిమజ్జనం చేసిన తర్వాత ఈ మట్టిలో మొక్కలు పెంచవచ్చు.
మట్టి వినాయకుల తయారీకి పెద్దగా ఖర్చు అవ్వదు. కానీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు చాలా ఖరీదుగా ఉంటాయి. అందువల్ల, మట్టి వినాయకుడిని పూజించడం వల్ల డబ్బు కూడా ఆదా అవుతుంది. స్థానికంగా తయారు చేసిన మట్టి వినాయకులను కొనడం వల్ల స్థానిక కళాకారులకు ఆర్థికంగా కూడా సహాయం చేసినట్టు అవుతుంది. ఈ విగ్రహాలను పూజించడం వల్ల మన సంస్కృతిని, సంప్రదాయాలను కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు