గ‌డ్డ పెరుగును చూడగానే ఎవ‌రికైనా తినాలనే కోరిక కలుగుతుంది. సామాన్యంగా చాలామంది భోజనంలో పెరుగన్నం లేకుండా వారి భోజనాన్ని ముగించారు. అనేక పోషక విలువలు ఉన్న ఈ పెరుగును మనం తినే అన్నంతో పాటు వీటిని కూడ కలిపి తీసుకుంటే అసలు అనారోగ్య సమస్యలే ఉండవు అని పరిశోధనలు చెపుతున్నాయి. పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స‌ర్లు మటుమాయ‌మైపోతాయి. ఈ మిశ్ర‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు వెంట‌నే త‌గ్గుతాయి. 
CURD PHOTOS కోసం చిత్ర ఫలితం
అదేవిధంగా పెరుగుతో పాటు కొద్దిగా జీల‌క‌ర్ర‌ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. ఇక కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేసి దాన్ని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకునితింటే జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ప్ర‌ధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి లేటెస్ట్ పరిశోధనలు చెపుతున్నాయి. అంతేకాకుండా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తింటే మన శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది. ముఖ్యంగా మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా దూరం అవుతాయని వైద్యులు చెపుతున్నారు. 
సంబంధిత చిత్రం
పెరుగులో కొంత ప‌సుపు కొంత అల్లం క‌లిపి తినడం వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నపిల్లల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. అదేవిధంగా కొంచెం వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తిన్నవారికి నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి అని అంటున్నారు. 
CURD PHOTOS కోసం చిత్ర ఫలితం
ఒక క‌ప్పు పెరుగులో కొంచెం న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినడం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూర‌మ‌వుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. ఇవే కాకుండా పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. ఇలా అనేక ప్రయోజనాలు కలిగిన పెరుగును తినడం అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: