ఎన్నికల వేళ టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు కొంత మంది టీడీపీ నేతలపై షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా రెబల్ అభ్యర్థులను పార్టీ నుండి ఉన్నపళంగా సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారని వినికిడి. కాగా కొందరు రెబల్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నట్టు సమాచారం. అంటే ఇక్కడ తమ నామినేషన్లను వెనక్కు తీసుకున్నారన్నమాట. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం కొసమెరుపు. స్వతంత్ర అభ్యర్థిగా దాఖలు చేసిన నామినేషన్‌ను మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వెనక్కు తీసుకున్నారు.

ఆయన తాజాగా తన అనుచరుడితో విత్‍డ్రా ఫామ్‍పై సంతకం చేసి పంపించగా ఆ తరువాత ముద్దరబోయిన కుటుంబ సభ్యులు కూడా తమ నామినేషన్లు వెనక్కు తీసుకోవడం గమనార్హం. కాగా అరకు, విజయనగరం, అమలాపురం, పోలవరం, ఉండి, సత్యవేడు నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికలకు సరిగా 12 రోజుల సమయం మాత్రమే ఉండగా బాబు నిర్ణయం ఇపుడు సర్వత్రా ఉత్కంఠతగా మారింది. ఇలాంటి పరిస్థితులలో బాబు చాలా డేరింగ్ అండ్ డేషింగ్ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఆ నిర్ణయం ఓ రకంగా ఇపుడు కూటమికి గండి కొట్టొచ్చనే అనుమానాలు మొదలయ్యాయి. మరోవైపు జనసేన అధినేతను టార్గెట్ చేస్తూ అధికార పార్టీ వైసీపీ తను వేయాల్సిన ప్లాన్స్ వేస్తూ పోతోంది. ఇలాంటి సమయంలో బాబు నిర్ణయం టీడీపీ పార్టీలో కొంతమందికి మింగుడు పడడం లేదనే గుసగుసలు వినబడుతున్నాయి.  

ఇక ఆయా నియోజకవర్గాలను వరుసగా గమనిస్తే.. అరకు నియోజకవర్గం (సివేరి అబ్రహం), విజయనగరం నియోజకవర్గం (మీసాల గీత), అమలాపురం నియోజకవర్గం (పరమట శ్యాంసుందర్‌), పోలవరం నియోజకవర్గం (ముడియం సూర్యచంద్రరావు), ఉండి నియోజకవర్గం (వేటుకూరి వెంకట శివరామరాజు), సత్యవేడు నియోజకవర్గం (జడ్డా రాజశేఖర్‌)ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: