వైఎస్సార్ ఫ్యామిలీలో అసలు ముసలం ఎందుకు మొదలైంది. షర్మిళ, జగన్ ల మధ్య అసలు పంచాయితీ ఏంటి. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పిన షర్మిళ.. ఇప్పుడు ఎందుకు జగనన్నకు గుచ్చే బాణంగా తయారైంది. ఇలాంటి చాలా ప్రశ్నలు ఏపీ ప్రజల మెదళ్లలో మెదులుతున్నాయి. అయితే వీటికి షర్మిళ ఎన్నికల అఫిడవిట్ సమాధానం  ఇచ్చినట్లే అనిపిస్తుంది.


షర్మిళ మొత్తం ఆస్తులు రూ.182.82 కోట్లు. వీటిలో రూ.82 కోట్ల 58 లక్షల 15 వేలను తన సోదరుడు జగన్ వద్ద అప్పు తీసుకున్నారు. అలాగే వదిన భారతీ వద్ద కూడా రూ.19లక్షల 56 వేల 682 నగదును అప్పుగా తీసుకున్నారు. ఏడాదికి తన ఆదాయం రూ.97లక్షల పైచిలుకు. తన భర్త అనీల్ ఆదాయం రూ.3లక్షలు. ఇంకా కేసులు వగైరా ఇతర అంశాలు. అయిత షర్మిళ తన అన్నతో విభేదించడానికి ఆస్తి తగాదాలే అని మొదటి నుంచి అనుమానం ఉన్నా తాజాగా ఈ అఫిడవిట్ తో ఇదే నిజమని చాలా మంది నమ్ముతున్నారు.


ఎందుకంటే ఇప్పటి వరకు వీరిద్దరి ఆస్తులు, అప్పుల విషయాలు ప్రజలకి ఎవరికీ తెలియదు. ఆమె ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న సందర్భంగా ఈ వ్యవహారం బయటకు అప్పుల వ్యవహారం బయటకు వచ్చింది.   ఆస్తుల విషయంలో మా అన్న నాకు అప్పు ఇచ్చారు అని షర్మిళే స్వయంగా చెప్పారు. అందుకే దానిని ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించాను అని చెప్పుకొచ్చారు.


అయితే సీఎం జగన్ ఎంత సోదరి అయినా ఏం పూచీకత్తు లేకుండా రూ.82 కోట్లను అప్పుగా ఇస్తారా. ఒకవేళ ఆమె ఇవ్వలేకపోతే తిరిగి ఏం స్వాధీనం చేసుకుంటారు. అంటే చెల్లిపై నమ్మకంతోనేగా ఇచ్చింది. లేదా ఆస్తుల పరంగా పంచుకున్న వాటాలు ఏంటి. అందులో షర్మిళకు వెళ్లినవి.. జగన్ కు దక్కినవి ఎన్ని. అసలు ఆస్తులు పంచారా లేదా అనే అంశాలపై స్పష్టత ఇచ్చి మా అన్న నాకు అప్పులు ఇచ్చారు అని విమర్శిస్తే అర్థం ఉంటుంది. కానీ ఇలా మాట్లాడటం ఆమెకే చేటు తెస్తుంది అని పలువురు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: