గోరంట్ల బుచ్చయ్య చౌదరీ....టీడీపీ సీనియర్ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి అంచెలంచలుగా ఎదుగుతూ వచ్చిన నాయకుడు. అయితే మధ్యలో ఎన్టీఆర్ ని చంద్రబాబు అధికారంలోకి దించేసిన సమయంలో, బుచ్చయ్య,  ఎన్టీఆర్ తో కలిసి నడిచారు. ఇక తర్వాత ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబు పిలుపుతో మళ్ళీ, బుచ్చయ్య టీడీపీలోకి వచ్చారు. ఇక బుచ్చయ్య నాలుగుసార్లు రాజమండ్రి సిటీ నుంచి టీడీపీ తరుపున గెలిచారు. అయితే 2014 ఎన్నికలొచ్చేసరికి పొత్తులో భాగంగా,  సిటీ సీటుని బీజేపీకి కేటాయించారు. దీంతో బుచ్చయ్యకు రూరల్ సీటు కేటాయించారు. కానీ అయిష్టంగానే బుచ్చయ్య అక్కడకి వెళ్లి పోటీ చేసి గెలిచారు.

 

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సామాజిక సమీకరణలో భాగంగా సీనియర్ గా ఉన్న బుచ్చయ్యకు మంత్రి పదవి రాలేదు. 2019 ఎన్నికల్లో కూడా బుచ్చయ్య రూరల్ లోనే పోటీ చేసి విజయం సాధించారు.  ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా బుచ్చయ్య, జగన్ ప్రభుత్వంపై సమయానుకూలంగా మాటలు తూటాలు పేలుస్తున్నారు. వయసు మీద పడిన సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రతిరోజూ సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వంపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆ సెటైర్లు చూసి, టీడీపీ కార్యకర్తలు బుచ్చయ్య తాత మంచి ఫామ్ లో ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు.

 

అయితే బుచ్చయ్య  ప్రత్యర్థి పార్టీ మీదే కాదు. తేడా వస్తే సొంత పార్టీపై కూడా విరుచుకుపడగలరు. ఏదైనా తప్పు చేస్తే చంద్రబాబుని సైతం నిలదీయగలరు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బాబు, ఇష్టారాజ్యంగా వైసీపీ నేతలని పార్టీలోకి చేర్చుకుంటే, బుచ్చయ్య వ్యతిరేకించారు. అలా చేర్చుకోవడం వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని చెప్పారు. దీంతో బాబు, బుచ్చయ్యని పక్కనబెట్టేశారు. ఆఖరికి తన నియోజకవర్గానికి నిధులు కూడా ఇవ్వలేదు. అయినా సరే బుచ్చయ్య ఎక్కడ వెనక్కి తగ్గకుండా నియోజకవర్గంలో పని చేసుకున్నారు. అలా పని చేసుకున్నారు కాబట్టే, జగన్ గాలిలో కూడా మళ్ళీ గెలవగలిగారు.

 

ఇక బుచ్చయ్య మాటల్లోనే కాదు..చేతల్లో కూడా ముందున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉంటున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందిస్తున్నారు. అయితే బుచ్చయ్య సిటీ నియోజకవర్గంలో కూడా వేలు పెడుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఆదిరెడ్డి భవాని ఎమ్మెల్యేగా ఉన్నా, తన వర్గం చేత ప్రత్యేకంగా గ్రూపు రాజకీయం నడుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే రాజకీయాల్లో బుచ్చయ్య రూటే సెపరేట్ అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: