ఎన్ని కష్టాలు ఎదురొచ్చిన జగన్ వెంట నిలబడిన వారిలో పాలకొండ ఎమ్మెల్యే కళావతి కూడా ఒకరు. ఏజెన్సీ ప్రాంతాల్లో తిరుగులేని నాయకుడుగా ఉన్న నర్సింహా దొర వారసురాలుగా రాజకీయాల్లోకి వచ్చిన కళావతి...2009 ఎన్నికల్లో పాలకొండ ఎమ్మెల్యేగా బరిలో దిగారు. అది కూడా ప్రజారాజ్యం ద్వారా పోటీ చేశారు. కానీ అనూహ్యంగా కళావతి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమె వైసీపీలోకి వచ్చేశారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున బరిలో దిగి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

అయితే అప్పుడు టి‌డి‌పి అధికారంలోకి వచ్చింది...దీంతో కళావతిని టి‌డి‌పిలోకి లాగేందుకు ఎన్ని ప్రయత్నాలు జరిగాయో చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా కళావతిని టి‌డి‌పిలోకి తీసుకోచ్చేందుకు విపరీతమైన ప్రలోభాలు పెట్టారు. కానీ కళావతి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా జగన్ వెంటే నిలబడ్డారు. ఇక అందుకే 2019 ఎన్నికల్లో కూడా కళావతి వైసీపీ తరుపున బరిలో దిగి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది...కానీ వైసీపీ అధికారంలో ఉన్న పెద్దగా ప్రయోజనం లేనట్లే కనిపిస్తోంది. పాలకొండలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగడం లేదు.

అయితే ఎమ్మెల్యే కళావతి...ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అటు సామాజిక సేవలో కూడా కళావతి ముందున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కళావతికి బాగా ప్లస్ అవుతున్నాయి. ఇక పాలకొండలో పలు సమస్యలు కూడా ఉన్నాయి. ఇక్కడ రోడ్ల పరిస్తితి మరీ దారుణంగా ఉన్నాయి..ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల సౌకర్యం లేదు. విద్యా, వైద్య సదుపాయాలు తక్కువ. నాగావళి నది ఉన్నా సరే సరిగ్గా తాగునీరు, సాగునీరు అందని పరిస్తితి ఉంది.

ఇటు రాజకీయంగా వస్తే...అధికారంలో ఉన్నారు కాబట్టి కళావతికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ రానున్న రెండున్నర ఏళ్లలో ఎక్కువ పనులు చేయకపోతే ఇబ్బంది అవుతుంది. అటు వరుసగా ఓడిపోతున్న టి‌డి‌పి నేత నిమ్మక జయకృష్ణపై సానుభూతి ఎక్కువగా ఉంది. ఆయన కూడా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు...ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే పాలకొండలో నెక్స్ట్ వైసీపీకి హ్యాట్రిక్ ఛాన్స్ అంత సులువు కాదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: