తెలుగు బుల్లితెరపై నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 2’లో పదహారు మంది కంటెస్టంట్లు పాల్గొన్నారు. ఇందులో 13 మంది సెలబ్రెటీలు కాగా, ముగ్గురు కామన్ మాన్స్ .  అయితే బిగ్ బాస్ మొదటి వారం చప్పగా సాగింది..రెండో వారం వచ్చే సరికి కాస్త హంగామా మొదలైంది. మొదటి వారంలో మోడల్ సంజన కాస్త హడావుడి చేసినా ఆమె మొదటి వారం ఎలిమినేట్ అయ్యారు. 
Image result for big boss 2 telugu
ఆ తర్వాత నూతన నాయుడు ఎలిమినేట్ అయ్యారు.  ఇలా కామన్ మాన్ కోటాలో చేరిన వారు ఒక్కొక్కరూ ఎలిమినేషన్ కావడంతో బిగ్ బాస్ పై విమర్శలు వస్తున్నాయి.  ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో మొదటి నుంచి బాబు గోగినేని తనదైన స్టైల్లో కొనసాగుతున్నారు.  బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ల్లో కూడా కొన్ని విమర్శలు చేస్తూ వచ్చారు.  ఆ మద్య ఓ టాస్క్ లో గాయపడిన సభ్యులను చూసి బాధతో బిగ్ బాస్ ని తీట్టాడు..ఇలా బాబు గోగినేని బిగ్ బాస్ హౌజ్ లో తనదైన వైఖరితో కొనసాగుతున్నారు.  ప్రస్తుతం ఆయన ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్నారు. 
Image result for big boss 2 telugu
ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్‌ చెరుకు రసం ఫ్యాక్టరీ టాస్క్‌ రెండో రోజూ ఆసక్తికరంగా సాగుతోంది. బాబు గోగినేని  కౌశల్‌తో మాట్లాడుతూ.. తమ టీమ్ నింపిన 100 చెరుకురసం బాటిళ్లలో 30 బాటిళ్లలో తాను నీళ్లు పోశానని చెప్పారు. ఈ మాటకు షాక్ అయిన కౌశల్ "సార్ ... మీరు కూడా చీట్ చేస్తారా" అన్నాడు. తాను కెమేరాకు చూపించే చేశానని చెప్పారు బాబు గోగినేని. అయితే అది తన తప్పు కాదు కానీ.. అక్కడ సంచాలకురాలిగా ఉన్న భానుశ్రీ గుర్తించక పోవడం ఆమె వైఫల్యమేనని తెలివిగా ఆమెపై తోసేశారు. మొత్తానికి బిగ్ బాస్ హౌజ్ లో ఒక్కోక్క కంటిస్టెంట్లు తమదైన వైఖరితో రంజింప చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: