బాలీవుడ్ హాట్ హీరోయిన్ ఊర్వశి రౌతెలా కాల్ గాళ్ గా మారింది. సంపత్ నంది నిర్మాణంలో వస్తుంది బ్లాక్ రోస్ సినిమాలో అమ్మడు కాల్ గాళ్ గా నటిస్తుంది. ఈ సినిమాను మొహన్ భరద్వాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో హాట్ ఇమేజ్ సంపాదించిన ఊర్వశి తెలుగులో చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే అవడం విశేషం. అంతేకాదు చేస్తున్న సినిమా కూడా అడల్ట్ కాన్సెప్ట్ తో వస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఊర్వశి రౌతెలా సినిమా అంటే అదరగొట్టాల్సిందే.

తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను ఏమాత్రం నిరాశపరచకుండా అమ్మడు తన సినిమాల్లో హాట్ సీన్స్ ఉండేలా చూస్తుంది. ఇక రాబోయే బ్లాక్ రోస్ కాన్సెప్టే అడల్ట్ కంటెంట్ తో వస్తుంది కాబట్టి లెక్కలేనన్ని ఇంటిమేట్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. సినిమాలతోనే కాదు ఫోటో షూట్ తోనే ఊర్వశి రౌతెలా గ్లామర్ షోతో కుర్రాళ్ళని నిద్రపట్టకుండా చేస్తుంది. అలాంటి ముద్దుగుమ్మకు అడల్ట్ కంటెంట్ తో ఛాన్స్ వస్తే పండుగ చేసుకోవ్డం ఖాయం.

టాలీవుడ్ లో కొద్దిగా అభినయంతో పాటుగా గ్లామర్ షో చేస్తే అలాంటి భామలకు మంచి డిమాండ్ ఉంది. ఊర్వశి రౌతెలా కూడా తెలుగులో చేస్తున్న బ్లాక్ రోస్ క్లిక్ అయితే అమ్మడు ఇక్కడ వరుస సినిమాలు చేసే ఛాన్స్ ఉంది. బాలీవుడ్ సినిమాలతో పాటుగా టాలీవుడ్ లో కూడా సినిమా చేస్తున్న ఊర్వశికి రానున్న రోజుల్లో స్టార్ క్రేజ్ దక్కేలా ఉందని చెప్పొచ్చు. తెలుగు ఆడియెన్స్ కు అమ్మడి అందాల ట్రీట్ నచ్చితే ఇక్కడ ఆమెకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెడతారని చెప్పడంలో సందేహం లేదు.                                                  


మరింత సమాచారం తెలుసుకోండి: