తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరో విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన విజయ్ దేవరకొండ తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుని  స్టార్ హీరో ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే చాలు తెలుగు ప్రేక్షకులందరూ ఉర్రూతలూగి పోయేలా ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అందరినీ ప్రభావితం చేస్తున్నాడు ఈ యువహీరో.  అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.



 ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  సాధారణంగానే పూరి జగన్నాథ్ సినిమాలు అంటే మాస్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. దానికితోడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ తోడైతే ఇక ఏ రేంజ్లో సినిమా ఉండబోతోందో అని  ప్రేక్షకులు  భారీ అంచనాలు పెంచుకొంటున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా కూడా తెరకెక్కుతుండడతో ఈ సినిమాపై అంచనాలు మరింత పిక్స్ రేంజ్ లోకి వెళ్ళి పోతున్నాయి.  కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయింది.



 ఇంకా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాలేదు అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. త్వరలో విజయ్ దేవరకొండ మళ్లీ షూటింగ్ ప్రారంభించబోతున్నారని  సమాచారం. అయితే సంక్రాంతి నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం విజయ్ దేవరకొండ బ్యాంకాక్ కు వెళ్లి పోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోని కీలకమైన ఫైట్ సీన్లను బ్యాంకాక్లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో ఒక పెద్ద డాన్  కొడుకుగా విజయ్ దేవరకొండ నటించనుండగా ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ  అనన్య పాండే నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: