సినీ ఇండస్ట్రీ లోకి ఒకే కుటుంబం నుంచి వచ్చిన ఎంతో మంది నటులు పరిచయమవుతున్నారు. ప్రస్తుతం స్టార్ హోదా ను అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఒకే కుటుంబం నుంచి వచ్చిన అక్క -  చెల్లెలు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హోదాలో ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు సిస్టర్స్ డే స్పెషల్ సందర్భంగా వారి గురించి తెలుసుకుందాం.


1). నగ్న - జ్యోతిక - రోషిని: తెలుగు సినిమా పరిశ్రమకి నగ్మా  గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు .ఈమె తన అందచందాలతో అందర్నీ మెస్మరైజ్ చేసిన నటి. ఈమె పలు భాషల్లో నటించి అందరినీ ఆకట్టుకుంది. ఈమె చెల్లెలు జ్యోతిక,రోషిని లు కూడా హీరోయిన్ లుగా మంచి స్టార్ హోదాలో ఉన్నారు.



2). కాజల్ అగర్వాల్ - నిషా అగర్వాల్:టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో కాజల్ కూడా ఒకరు. ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ , ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తన చెల్లెలు నిషా అగర్వాల్ కూడా పలు సినిమాల్లో నటించింది కానీ అంత సక్సెస్ కాలేదు.



3). ఆర్తి అగర్వాల్ - అతిథి అగర్వాల్:ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆర్తి అగర్వాల్, తెలుగులో ఎన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది . అయితే ఈమె ఆకస్మాత్తుగా చనిపోవడం వల్ల తన అభిమానులు చాలా బాధ పడ్డారు. అయితే ఇక తన సోదరి అతిథి అగర్వాల్ గంగోత్రి సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ అంత సక్సెస్ కాలేకపోయింది.


4). కార్తీక - తులసి:సౌత్ ఇండియన్ హీరోయిన్స్ కార్తీక,తులసి లు పలు సినిమాల్లో నటించారు. కార్తీక తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తులసి పలు సినిమాలలో నటించగా ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టింది.


5). సంజనా - నిక్కీ గల్రానీ : ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకున్న హీరోయిన్ సంజన. ఇక తన సోదరి నిక్కీ కూడా తెలుగులో , తమిళంలో నటించి తన నటనకు పేరు సంపాదించుకుంది.


6). శృతి హాసన్ - అక్షర హాసన్:టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన గ్లామర్ బ్యూటీ శృతిహాసన్. ఈ  బ్యూటీ ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉండగా, ప్రస్తుతం మళ్లీ  క్రాక్  సినిమా ద్వారా రీ  ఎంట్రీ ఇచ్చింది. ఇక తన  చెల్లెలు అక్షర హాసన్ కూడా బాలీవుడ్ హీరోయిన్ గా, సహాయ దర్శకుడిగా మంచి సక్సెస్ ను  అందుకుంది.


7). షాలిని - శామిలి:ప్రముఖ భారతీయ నటి శాలిని బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి , తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది. ఇక చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి లో కూడా వీరిద్దరు నటించారు. ఇక ఆ తర్వాత వీరిద్దరు పలు సినిమాలలో హీరోయిన్స్ గా బాగా ప్రేక్షకాదరణ పొందారు.


8). రాధిక - నిరోషా:తెలుగులో కొన్ని సినిమాలలోనే నటించిన నటి నిరోషా, ఇక ఆమె సోదరి రాధికా కూడా కథానాయికగా మంచి గుర్తింపు అందుకుంది.


9). జయసుధ - సుభాషిని:
అలనాటి తార జయసుధ ఎన్నో సినిమాల్లో నటించి అందరినీ మెప్పించింది. ఇక తన చెల్లెలు సుహాసిని కూడా మంచి నటిగా పేరు పొంది , విలన్ పాత్రలో కూడా  నటించి మెప్పించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: