చిరుత మూవీతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన మెగాస్టార్ తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఆ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. అనంతరం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన మగధీర మూవీలో నటించారు చరణ్. రెండు జన్మల కథగా మంచి యాక్షన్, ఎమోషనల్ అంశాలతో అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించే విధంగా రాజమౌళి ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.

కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి ఒక ప్రధాన పాత్ర చేసారు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇందులో కాలభైరవ గా, అలానే హర్ష గా రెండు పాత్రల్లో కూడా చరణ్ అద్వితీయ నటన కనబరిచారు అనే చెప్పాలి. ఒక జన్మలో విడిపోయిన ప్రేమికులు మళ్ళి 400 ఏళ్ళ తరువాత పుట్టి తమ ప్రేమను ఎలా జయించారు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని రాజమౌళి విజువల్ వండర్ గా తెరకెక్కించారు అని చెప్పకతప్పదు.

కాజల్ అగర్వాల్ అందచందాలు, రాజమౌళి ఆకట్టుకునే టేకింగ్, గ్రాండియర్ విజువల్స్, స్క్రీన్ ప్లే, అలరించే సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, భారీ నిర్మాణ విలువలు వంటివి ఈ సినిమాకి ఇంత గొప్ప విజయాన్ని అందించాయి. 2009 జులై 31న విడుదలైన ఈ సినిమా అప్పటివరకు ఉన్న టాలీవుడ్ సినిమా రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్స్ ని నమోదు చేసింది. ఈ మూవీ తో హీరోగా చరణ్ కు దర్శకుడిగా రాజమౌళి కి భారీ క్రేజ్ దక్కింది. ఫాంటసీ కలగలిపిన యాక్షన్ డ్రామా మూవీ గా రూపొందిన ఈసినిమాలో దేవ్ గిల్ విలన్ గా నటించారు. మొత్తంగా రాజమౌళి, చరణ్ ల కాంబోలో తెరకెక్కిన ఈ మగధీర మూవీ టాలీవుడ్ లోని ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ లో ఒకటిగా చెప్పవచ్చు ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: