ఇటీవల కాలంలో సమాజం మీద ప్రభావం చూపించే సినిమాలు ఎన్నో వస్తున్నాయి. పెద్ద పెద్ద హీరోలు సైతం సమాజంలో ప్రజలను తీర్చిదిద్దే విధంగా అన్యాయాలను అరికట్టే విధంగా ఆలోచనలు చేస్తూ సినిమాలను చేస్తున్నారు. అలా పవన్ కళ్యాణ్ ఇటీవలే వకీల్ సాబ్ చిత్రం చేసి ఆడవారిపై జరిగే అన్యాయాలను ఎదిరించాడు. వాస్తవానికి సమాజం మీద సినిమా ప్రభావం చాలా ఉంటుంది.  అయితే అన్ని సినిమాలలో సమాజానికి మంచి చూపించే వీలు ఉండదు. కాబట్టి ఏ సినిమాలోనైనా మంచిని మాత్రమే గ్రహించాలి.

చెడు ను తీసుకోకూడదు. సినిమాను వినోదాత్మకంగా చూసి ఎలా అయితే ఆనందపడతారో మంచిని స్వీకరించి దాన్ని ఆచరించే విధంగా ముందుకు వెళ్లాలి.  చాలా మంది హీరోలు బయట కూడా సమాజం పట్ల ఎంతో బాధ్యతన చూపిస్తూ ఉంటారు.  తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది హీరోలు కొన్ని సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆదుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో సూర్య ఒకడు.  తన సినిమాల ద్వారా ఎప్పుడూ మంచి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ హీరో. అవసరమైతే ఆ సినిమా కోసం ఎంతటి పనైనా చేస్తాడు.

అలా జై భీమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సమాజంలో అణగారిన వర్గాల కోసం పాటుపడే లాయర్ కథ ఇది అని సినిమా ట్రైలర్ను బట్టి తెలుస్తుంది.  ఈ విధంగా సూర్య మాత్రమే చేయగలడు అనే అభిప్రాయం ఈ ట్రైలర్ చూసిన తర్వాత జనాల్లో కలుగుతుంది. ఇలాంటి సినిమాలు కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ కాకపోతూ ఉండడంతో చాలా మంది నిర్మాతలు ఈ తరహా సినిమాలు చేయడానికి ముందుకు రారు. అందుకే తన స్వీయ నిర్మాణంలో ని ఈ చిత్రాన్ని చేశాడు. అమెజాన్ వాళ్ళతో డీల్ కుదుర్చుకుని ఈ సినిమాను మొదలు పెట్టగా దర్శకుడు ఈ చిత్రానికి జ్ఞానవెల్ దర్శకత్వం వహించాడు. దీపావళి సందర్భంగా నవంబర్ 2వ తేదీన ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: