రానా దగ్గుబాటి హీరోగా వేణు ఊడుగుల డైరక్షన్ లో వస్తున్న సినిమా విరాటపర్వం. సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ లక్షమి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లో కూడ్డా సమర్పిస్తున్నారు. సినిమాలో ప్రియమణి, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. 90వ దశకంలో ఉత్తర తెలంగాణాలో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితులైన ఓ యువతి వారితో ఎలా ఉద్యమం లోకి వెళ్లింది..? గ్రామాల్లో ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని డాక్టర్ రవిశంకర్ ఎలా రవన్న గా మారాడు అన్నది విరాటపర్వం కథ.

కామ్రేడ్ రవన్నగా రానా దగ్గుబాటి నటించిన ఈ సినిమాలో సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటిస్తుంది. కామ్రేడ్ భారతక్క పాత్రలో ప్రియమణి నటిస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకాస్త షూటింగ్ బ్యాలెన్స్ ఉందని చెబుతున్నారు. ఇక న్యూ ఇయర్ కానుకగా సినిమా నుండి ఓ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. సినిమా దాదాపు కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తుంద్ది. కొత్త పోస్టర్ లో అయినా విరాటపర్వం రిలీజ్ డేట్ ఇస్తారని అనుకున్న ఫ్యాన్స్ కి నిరాశ మిగిలింది. మరి రానా, సాయి పల్లవిల విరాటపర్వం ఎలా ఉండబోతుందో చూడాలి.

ఈమధ్యనే శ్యాం సింగ రాయ్ తో సూపర్ హిట్ అందుకున్న సాయి పల్లవి ఆ సినిమాలో తన నటన తో మెప్పించింది. ఇక ఇప్పుడు విరాటపర్వం సినిమా తో మరోసారి సత్తా చాటాలని చూస్తుంది. సినిమా లో రానా, సాయి పల్లవిల నటన నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: