అందాల ముద్దుగుమ్మ నందిత శ్వేత, నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో నందిత శ్వేత కు టాలీవుడ్ లో పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు దక్కాయి.  అందులో భాగంగా నందిత శ్వేత, నితిన్ హీరోగా తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమా లో ఒక ముఖ్య పాత్రలో నటించింది. అలాగే అక్షర అనే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నందితా శ్వేత నటించింది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న నందిత శ్వేతా కు ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నిరాశనే మిగిల్చింది. ఇలా టాలీవుడ్ లో నటించింది తక్కువ సినిమాలే అయిన నందిత శ్వేత మాత్రం టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇలా సినిమాలతో ఎంత మంది ప్రేక్షకులను అలరించిన ఈ అందాల ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులకు టచ్ లో ఉంటుంది. 

తన  షూటింగ్ అప్డేట్ లను,  తన డైలీ యాక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన అందచందాలు ప్రదర్శితమయ్యేల ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా నందిత శ్వేత కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ చీర కట్టుకొని స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి క్లాస్ లుక్ లో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం నందిత శ్వేత కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: