ప్ర‌ముఖ న‌టి, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ శ్రీ‌రెడ్డి గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయంటూ గ‌ళం విప్పిన శ్రీ‌రెడ్డి.. ఫిలిం ఛాంబర్ ముందు అర్ధ నగ్న నిరసన చేపట్టి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ క్ర‌మంలోనే
టాలీవుడ్ ప్ర‌ముఖ‌ల‌పై అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. అప్ప‌ట్లో శ్రీరెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మ‌ద్ధ‌తు తెలిప‌గా కాస్టింగ్ కౌచ్ ఓ ఉద్యమంలా మారింది.

అప్ప‌టి నుంచీ అడపా దడపా ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి కాస్టింగ్ కౌచ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉంటున్నారు. ఇక ప్ర‌స్తుతం శ్రీ‌రెడ్డి ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయాల‌పై మాత్రమే కాకుండా సామాజిక అంశాలు, రాజకీయాలపై కూడా త‌న‌దైన శైలిలో పోస్టులు పెడుతూ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటుంది. అలాగే సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ర‌న్ చేస్తున్న ఈమె.. గ‌తంలో టాలీవుడ్ ద‌ర్శక‌ నిర్మాత‌ల‌ను పెద్ద బ్రోక‌ర్లు అంటూ పేర్కొంది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శ్రీ‌రెడ్డి `సినీ ఇండ‌స్ట్రీలో దర్శక నిర్మాతలే పెద్ద బ్రోకర్ లు. ఎంతో కష్టపడి నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తెలుగు అమ్మాయిలకు ఇక్కడ అవకాశాలు ఉండవు. ఒక వేళ అవకాశాలు ఉన్నా నిర్మాతల పక్కన పడుకుంటేనే అవి వస్తాయి, కొన్ని సార్లు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అవకాశాలు ఇవ్వ‌కుండా మోసం చేసేవారు ఉంటారు` అంటూ ఆమె వ్యాఖ్యానించింది. దాంతో అప్ప‌ట్లో శ్రీ‌రెడ్డి వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపాయి.

కాగా, సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా ఉండే శ్రీ‌రెడ్డి.. మాట‌ల‌తోనే కాదు అందాల ఆర‌బోత‌లోనూ రెచ్చి పోతుటుంది. ఎప్ప‌టి క‌ప్పుడు హాట్ హాట్ ఫొటోల‌ను షేర్ చేస్తూ కుర్ర కారుకు మ‌తి పోగొడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: