టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని చౌదరి  దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు, దేవదాస్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని మొదటి సినిమా తోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.  ఆ తర్వాత రామ్ పోతినేని నటించిన సినిమాలు కూడా ఎక్కువ శాతం మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంతో ప్రస్తుతం రామ్ పోతినేని టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు,  ఇలా క్రేజీ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న రామ్ పోతినేని వరస పరాజయాలతో ఉన్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయంతో ఫుల్ ఫాం లోకి వచ్చాడు.  

ఈస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన రెడ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫర్వాలేదు అనే టాక్ ను సొంతం చేసుకుంది,  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ పోతినేని తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది,  ఈ సినిమాలో రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు,  ఈ సినిమా నుండి ఇప్పటికే  ఫస్ట్ లుక్ పోస్టర్ ను  చిత్ర బృందం విడుదల చేయగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది,  ది వారియర్ మూవీ తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా విడుదల చేయబోతున్నారు.  ఈ సినిమాతో పాటు రామ్ పోతినేని టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించబోతున్నాడు,  రామ్ పోతినేని , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పటికే జరిగిపోయింది,  ఇలా సినిమా సెట్స్ పై ఉండగానే రామ్ పోతినేని మరో సినిమాను లైన్ లో పెట్టి ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: