ఇక నేడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నేషనల్ లెవల్లో సూర్యునిలా వెలిగిపోతుంది అంటే అంతా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి పుణ్యమే అని చెప్పుకోవాలి. బాహుబలి అనే పాన్ ఇండియా వండర్ఫుల్ సినిమా లేకపోతే తెలుగు సినిమా పేరు అసలు ప్రపంచానికి తెలిసేది కాదేమో.అంతకు ముందు ఒకరిద్దరు దక్షిణాది దర్శకులు ఇలాంటి ప్రయత్నం చేసినప్పటికీ ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అయిన దర్శకుడు ఒక్క రాజమౌళి మాత్రమే అని చెప్పుకోవాలి. బాహుబలి సినిమాతో ప్రభాస్‌ను ప్యాన్ ఇండియా స్టార్‌గా చేసిన జక్కన్న రాజమౌళి.. ఈ యేడాది rrr మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు కూడా పెద్ద ప్యాన్ ఇండియా హీరోలు అనే ఇమేజ్‌ను తీసుకొచ్చారు.ఈ క్రమంలో తాజాగా కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ సిద్ధార్ధ్ ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. rrr మూవీతో ntr పూర్తి స్థాయిలో హిందీతో పాటు మిగతా దక్షిణాది ప్రేక్షకులను కూడా పలకరించారు. అంతకు ముందుమెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. 'జంజీర్' మూవీ రీమేక్‌తో పలకరించినా.. ఆ సినిమాతో విమర్శల పాలయ్యారు. అపుడు తిట్టిన నోళ్లతోనే ఇపుడు పొగడ్తలను వింటున్నాడు. ఈ సినిమాతో వీళ్లిద్దరు ప్యాన్ ఇండియా స్టార్స్‌ అయిపోయారు.


ఇక కార్తికేయ 2 అనే మూవీతో నిఖిల్ బాలీవుడ్‌లో సత్తా చాటాడు. ఈ సినిమా మౌత్ పబ్లిసిటీతో హిందీలో చాలా స్పీడ్ గా దూసుకుపోతుంది.ఈ సినిమా ఇప్పటి వరకు కూడా హిందీలో రూ. 16.50 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. ఓవరాల్‌గా రూ. 100 క్లబ్బుకు చేరువలో ఈ సినిమా చేరువలో ఉంది. మొత్తంగా కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుల విషయానికొస్తే.. రాజమౌళి పూర్తి స్థాయిలో ప్యాన్ ఇండియా దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించారు. అతని తరువాత సుకుమార్ 'పుష్ప' సినిమాతో సుకుమార్ కూడా తనదైన మార్క్ పాన్ ఇండియా స్థాయిలో క్రియేట్ చేసుకున్నాడు. ఈ లిస్టులో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరుని కూడా చెప్పుకోవాలి.. తెలుగులో ఇతను తీసిన అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ గా  రీమేక్ చేసి అక్కడ కూడా విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: