మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీలో కి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఇక లేటుగా వచ్చినా కాస్త లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్.  ఉప్పెన అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. తెలుగు ప్రేక్షకులందరూ చూపును కూడా తన వైపుకు తిప్పుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే మొదటి సినిమా లోని తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు వైష్ణవ్ తేజ్. ఇక ఆ తర్వాత కొండపొలం  సినిమాతో  కమర్షియల్ జోలికి వెళ్లకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రను ఎంచుకుని తన సినిమాల పంథా  ఏంటో మరోసారి ప్రేక్షకులకు చాటి చెప్పాడు అని చెప్పాలి.


  ఇక ఇప్పుడు రంగ రంగ వైభవంగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వైష్ణవ్ తేజ్. కాగా ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది కూడా.   ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రస్తుతం బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ప్రమోషన్స్ లో  భాగంగా మీడియాతో ముచ్చటించిన  వైష్ణవ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకే రకమైన జానర్లో కథలు చేయాలని లేదు అంటూ చెప్పుకొచ్చాడు. తన దారిలోకి వచ్చిన వాటిలో ఏదైతే కొత్తగా అనిపించి తనను  ఉత్తేజపరుస్తోంది అంటే ఓకే చెబుతా అంటూ  చెప్పుకొచ్చాడు.


 ఈ క్రమంలోనే వైష్ణవ్  తేజ్ కి అటు మీడియా ప్రతినిధుల నుంచి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మెగా ఫ్యామిలీ లో ఉండే స్టార్ హీరోలు లేదా మీ మామయ్య సినిమా లలో ఏది  రీమేక్ చేయాలనే ఆశ మీకు ఉంది అంటూ ప్రశ్నించారు.  మామయ్యలు చిరంజీవి పవన్ కళ్యాణ్ లను  చూస్తూనే పెరిగాను. కాబట్టి వారు చేసిన చిత్రాలను టచ్  చేయాలని నేను అస్సలు అనుకోను. కానీ ఎవరైనా వచ్చి ఈ సినిమా బాగుంది నువ్వు రీమేక్ చేయాలి అని అడిగితే చిన్న మామయ్య నటించిన బద్రి  సినిమా రీమేక్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు బద్రి సినిమా  తన జీవితంలో ఏకంగా 120 సార్లకు పైగా చూసాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: