యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. యాంకర్ గా,నటిగా కనిపించింది అయితే అనుకున్న పేరును మాత్రం ఎక్కడ అందుకోలేక పోయింది.అయితే ఈ అమ్మడు అందాలను చూపించడంలో మాత్రం వెనక్కి తగ్గల్లేదు.. ఆఫర్స్ ఉన్నా లేకున్నా మాత్రం అందంతో ఎప్పుడూ రచ్చ చేసేందుకు రెడీగా ఉంటుంది..గ్లామర్ మెరుపులకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ చేస్తూ ఎంత రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి… కెరీర్ ఆరంభంలో గ్లామర్ షోకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. రాను రాను ఈ అమ్మడు అందాల డోస్ పెంచుతూ కేక పెట్టిస్తుంది. ఆరంభంలో నాజూకుగా కనిపించిన వర్షిణి కొద్ది రోజులకి బొద్దుగా మారింది. ఇప్పుడు మళ్లీ వర్షిణి స్లిమ్ లుక్ లోకి మారిపోయిమతిపోగొట్టే పరువాలతో నానా రచ్చ చేస్తుంది. వర్షిణి ఇటీవల పెద్దగా షోలతో సందడి చేయడం లేదు. అయితే ఈ అమ్మడు ఎంత బిజీగా ఉన్నా కూడా తన తోటి స్నేహితుల వేడుకకి హాజరు అవుతూ ఉంటుంది. భీమ్లా నాయక్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించి మెప్పించిన మౌనిక రెడ్డి.. వివాహం రీసెంట్‌గా గ్రాండ్ గా జరిగింది.


గోవాలో రెండు రోజుల పాటు మౌనిక వివాహం జరగగా, ఈ అమ్మడు సందీప్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. డిసెంబర్ 17న ఉదయం 11 గంటలకు హల్దీ ఫంక్షన్ జరుగగా.. డిసెంబర్ 18న 11.39 నిమిషాలకు వీరి వివాహం జరిగింది.వర్షిణి కూడా ఈ వివాహ వేడుకలో నానా రచ్చ చేసింది. చీర కట్టుకుని పెళ్లి కూతురులా ముస్తాబై బీచ్ ఒడ్డున మండపంలో సందడి చేసిన ఈ అమ్మడు బారాత్‌లో కూడా వర్షిణి చేసిన రచ్చ మాములుగా లేదు.. డోలు శబ్దాలకు మాస్ స్టెప్స్ తో తీన్మార్ డ్యాన్స్ చేసిన వర్షిణిని చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.. ప్రస్తుతం వర్షిణి వీడియా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: