
1987 లో నాయకుడు సినిమా తర్వాత కమలహాసన్, విలక్షణ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో ఇప్పుడు ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇందులో త్రిష హీరోయిన్ గా నటించనున్నట్లు కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. ఇటీవల త్రిష ప్రధాన పాత్రలో నటించిన రాంగీ సినిమా కూడా విడుదల అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కమలహాసన్, మణిరత్నంతో మళ్ళీ సినిమా చేయాలని ఉందంటూ ఆమె చెప్పడంతో ఇప్పుడు ఇన్ డైరెక్ట్ గా కమల్ , మణిరత్నం సినిమాలో హీరోయిన్గా నటించనున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
కానీ ఇప్పుడు ఇదే విషయంపై.. కమలహాసన్ 234వ చిత్రంలో త్రిష జతకట్టనుంది అని అధికారికంగా వెలువడింది. ఇప్పటికే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ -1 సినిమాలో చోళ యువరాణి కుందవై పాత్రలో నటించిన ఈమె ఇందులో తన నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్లో కూడా నటిస్తోందని సమాచారం. ఈ సినిమా సీక్వెల్ పూర్తయిన వెంటనే మణిరత్నం, కమలహాసన్ తో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది అని సమాచారం.మద్రాస్ టాకీస్, రెడ్ జైంట్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాను కమలహాసన్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.