సాదరణంగా ఒకసారి ఇండస్ట్రీకి దూరమై కాస్త గ్యాప్ వచ్చిన తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్లుగా కొనసాగిన వారు అయినా సరే రీ ఎంట్రీ ఇస్తే వారికి అవకాశాలు దక్కడం దాదాపు అసాధ్యం అన్న భావన ఇండస్ట్రీలో ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. కానీ అవన్నీ వట్టి మాటలు మాత్రమే అని నిరూపించింది శృతిహాసన్. దాదాపు మూడేళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇక ఆ తర్వాత రవితేజతో జోడి కట్టి క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ  ఇచ్చింది. మొదటి సినిమాని సూపర్ హిట్ కొట్టడంతో ఈ అమ్మడికి తిరుగులేకుండా పోయింది. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన కూడా నటిస్తూ ప్రస్తుతం ఎంతో బిజీబిజీగా గడుపుతుంది శృతిహాసన్.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోలుగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవితో జోడి కట్టింది శృతిహాసన్. ఇద్దరు హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ రెండు సినిమాల్లో కూడా ఇద్దరు హీరోలకు మంచి పాటలను మ్యూజిక్ డైరెక్టర్లు కంపోస్ట్ చేయడంతో అటు శృతిహాసన్ డాన్స్ ఇరగదీసి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇక ఈ రెండు సినిమాల్లో శృతిహాసన్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించబోతుంది అన్నది తెలుస్తుంది.


 వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో శృతిహాసన్ కి ఒక ఫన్నీ ఫైట్ సీను ఉంటుందట. ఈ సన్నివేశం మొత్తం ప్రేక్షకులు అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ సరదాగా సాగిపోతుందని టాక్. ఈ ఫైట్ సన్నివేశాన్ని రామ్ లక్ష్మణ్ మాస్టర్లు కంపోజ్ చేశారట. చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానికి శృతిహాసన్ అందం చలాకీతనం తోడైతే ఇక ప్రేక్షకులకు పొట్ట చెక్కలు అవ్వాల్సిందే అనేది తెలుస్తుంది. అదే సమయంలో ఇక బాలయ్య హీరోగా తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమాలో కూడా శృతిహాసన్ తో అదిరిపోయే కామెడీ సీక్వెన్స్ ప్లాన్ చేశాడట దర్శకుడు. కాగా తండ్రి కమలహాసన్ ను గుర్తుచేసేలా వీరసింహారెడ్డి సినిమాలో శృతిహాసన్ కామెడీ ట్రాక్ ఉంటుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: