ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రమాదవశాత్తు గ్యాస్ పేలుడు సంభవించినప్పుడు, ఆయా కంపెనీలు జీవిత భీమా కవరేజ్ కింద రూ.50 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ను అందిస్తాయి. అయితే ఇందుకోసం గ్యాస్ పేలుడు సంభవించిన తరువాత వెంటనే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు అలాగే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.ప్రమాదం జరిగి ప్రాణాపాయం సంభవించినట్లయితే ఎఫ్ఐఆర్,మెడికల్ ట్రీట్మెంట్, ప్రిస్క్రిప్షన్,మెడికల్ బిల్స్, పోస్టుమార్టం రిపోర్ట్,డెత్ సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది.ఇక వినియోగదారులతో ఎటువంటి సంబంధం లేకుండా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఇన్సూరెన్స్ కోసం ఆ కంపెనీలే క్లేయిమ్ చేస్తాయి.