అమెరికాకు చెందిన కాన్ స్టాంటిన్ - అంకీవ్ ఫిజినెస్ట్ గా పని చేస్తుండేవాడు. నిజానికి ఇతనికి క్రెడిట్ కార్డు వినియోగంతో లభించే క్యాష్ బ్యాక్ రివార్డ్ పాయింట్స్ అంటే ఎంతో ఆసక్తి. ఈ కారణం చేతనే ఇక 2009 నుంచి క్రెడిట్ కార్డు వినియోగించడం ప్రారంభించాడు. ఇక సరదాగా మొదలు పెట్టిన ఈ పద్ధతి కాస్త అలవాటుగా మారి, చివరికి వృత్తిగా మారింది. దాంతో లక్షలు లక్షలు సంపాదించడం ప్రారంభించాడు.అయితే తను ఎలా సంపాదించేవాడు అంటే, ఉదాహరణకు 500 డాలర్ల గిఫ్ట్ కార్డు కొనుగోలు చేస్తే, దాని మీద అతనికి ఐదు శాతం అంటే ఇరవై ఐదు డాలర్ల రివార్డు పొందేవాడు. ఇక దీన్ని ఎన్ క్యాష్ చేసుకోవాలంటే $6 చెల్లించాలి. ఇక 25 లోనుంచి $6 చెల్లిస్తే, అతడి దగ్గర $19 మిగిలిపోతాయి. ఇక ఇదే అతనికి వచ్చే ఆదాయం. అలా వచ్చిన రివార్డుల ద్వారా అతడు మూడు లక్షల డాలర్లకు పైగా సంపాదించాడు ఇప్పుడు మన కరెన్సీ విలువ 2.17 కోట్ల రూపాయలు.. ఇక ఈ వార్త తెలుసుకున్న ఇన్కమ్ టాక్స్ అధికారులు అతడికి నోటీసులు కూడా జారీ చేశారు.