ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి హౌస్ బిల్డింగ్ బెనిఫిట్స్ ను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ హెచ్ బీ ఏ బెనిఫిట్స్ ను ఇంకొంత కాలం పొడిగించింది. ఇక దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలగనుంది. ఇక ఈ ప్రయోజనాన్ని 2022 సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు అందుబాటులోకి ఉంచనున్నట్లు మోదీ సర్కార్ ప్రకటించింది. ఎవరైతే కొత్త ఇల్లు నిర్మించాలి అనుకుంటున్నారో లేదా కొనుగోలు చేయాలనుకుంటున్నారో అలాంటివాళ్లు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ కింద ముందుగానే డబ్బులు తీసుకోవచ్చు.ఇక ఈ హెచ్ బీ ఏ బెనిఫిట్స్ కింద మూడు సంవత్సరాల బేసిక్ సాలరీ కి సమానమైన మొత్తం డబ్బులను లేదా 25 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది