వ్యాపారంలో ఏవ్యక్తి రాణించాలి అని కోరుకున్నా ఆ వ్యాపారాన్ని నిర్వహించే వ్యక్తి తన ఖాతాదారుడి స్థానంలో ఉన్నానని భావించుకున్నప్పుడు మాత్రమే విజయాన్ని ఆ తరువాత సంపదను అందుకోగలడు. మనం కష్టమర్ గా ఉన్నప్పుడు ఒక వ్యాపారి మన పట్ల ఎలా ఉండాలి అని కోరుకుంటామో అదేవిధంగా ఒక వ్యాపారి తన వ్యాపార సంస్థలో తాను ఎప్పుడు ఒక కష్టమర్ గా భావన చేసుకుంటూ వ్యాపార నిర్వాహణలో పాల్గోనప్పుడు మాత్రమే ఆ వ్యాపార విజయం ఆధారపడి ఉంటుంది.


అదేవిధంగా ఒక వ్యక్తి తాను చేసే వ్యాపారంలో దేవుడు తన భాగస్వామి అని భావించుకుంటూ ఉండాలి. అలా భావించుకున్నప్పుడు దేవుడులో ఉండే ప్రేమ సత్యం ప్రకాశం వంటి లక్షణాలు మానసికంగా ఆ వ్యాపారి పై కూడ ప్రభావితం చేస్తూ ఆ వ్యాపారి నిర్వహించే వ్యాపారం కానీ లేదా పరిశ్రమ కానీ పూర్తి విజయవంతం అయ్యే ఆస్కారం ఉంది. 


ఇదే సందర్భంలో ఒక వ్యక్తి తాను ఎంచుకున్న రంగంలో విజయం సాధించే విషయంలో అతడి మాట కూడ కీలక పాత్ర పోషిస్తుంది. చెప్పే విషయం కఠినంగా ఉన్నా ఆ విషయమాన్ని స్పష్టంగా ఎదుటి వ్యక్తికి కష్టం కలిగించకుండా చెప్పే విషయంలో ఒక వ్యక్తి గొంతు ప్రధాన పాత్రను పోషిస్తుంది. మాటలను మృదుమధురంగా మాట్లాడుతూనే ఎదుటి మనిషిని నొప్పించకుండా తెలివిగా మాట్లాడినప్పుడు మాత్రమే ఏ మనిషి అయినా తాను ఎంచుకున్న రంగంలో విజయాన్ని పొందగలడు.


అదేవిధంగా ప్రతిరోజు ఉదయం ఒక వ్యక్తి తన దైనందిన వ్యాపార వ్యవహారాలను ప్రారంభించే ముందు కనీసం 10 నిముషాల పాటు కళ్ళు మూసుకుని తాను నిర్వర్తించే అన్ని పనులు విజయవంతం కావాలని కోరుతూ చేసే ప్రార్థన భగవంతుడుకి ఎంతో నచ్చుతుంది అని ఆధ్యాత్మిక వాదులు అంటారు. ప్రపంచ వ్యాప్తంగా విజయవంతమైన అనేకమంది వ్యాపార సంస్థల అధినేతలు ఇలాంటి పద్ధతులు అనుసరించామని అనేకసార్లు ఓపెన్ గా చెప్పారు. ఈ ఖచ్చితమైన ఉపాయాలు అన్నీ అనుసరంచే ఏవ్యక్తి అయినా ఐశ్వర్య వంతుడు కాగలడు

మరింత సమాచారం తెలుసుకోండి: