అమెజాన్ – రెలియన్స్ సంస్థల మధ్య కుదరబోతున్న ఒప్పందంతో రిటైల్ రంగంలో ప్రత్యర్దులుగా ఉన్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ రిలయన్స్ ముకేష్ అంబాని మిత్రులుగా మారబోతున్నారు. దీనితో దేశీయ రిటైల్ రంగంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ రిలయన్స్ రిటైల్ లో 1.50 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న పరిస్థితులలో రిలయన్స్ రిటైల్ లో 40 శాతం వాటా అమెజాన్ సంస్థ వసం కాబోతోంది.


ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ మార్కెట్ విలువ 4.21 లక్షల కోట్లుగా అంచనాలు వేస్తున్నారు. ఇప్పుడు ఈ సంస్థలో అమెజాన్ సంస్థ 40 శాతం వాటా తీసుకుంటున్న నేపధ్యంలో భారతదేశ చరిత్రలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా అమెజాన్ రిలియన్స్ ల ఒప్పందం మారబోతోంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లో రిలయన్స్ కంపెనీ షేర్ విలువ దూసుకుపోతున్న పరిస్థితులలో రిలయన్స్ మార్కెట్ విలువ 15 లక్షల కోట్లు దాటి భారత్ లో ఈ ఘనత సాధించిన తొలి కంపెనీగా చరిత్ర సృష్టిస్తోంది.


మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ దేశంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది. కరోనా సంక్షోభ సమయంలో 867 రూపాయల వద్ద ట్రేడ్ అయిన ఈ రిలయన్స్ షేర్లు ఈ అమెజాన్ ఒప్పందంతో 2,314 రూపాయల స్థాయికి చేరుకోవడం మార్కెట్ వర్గాలలో సంచలన వార్తగా మారింది. గత మార్చి నెల కనిష్ట స్థాయితో పోలిస్తే ప్రస్తుతం రిలయన్స్ ధర రెట్టింపు కావడంతో ఈ సంస్థ వాటా దారులు ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నారు.


రిలయన్స్ ఇండస్ట్రీ ఇప్పటికే తన డిజటల్ సేవల కంపెనీ జియోలో 32.84 శాతం వాటా విక్రయం ద్వారా 1,52 వేల కోట్లు సమీకరించింది. ఇప్పుడు రిలయన్స్ రిటైల్ అమెజాన్ సంస్థతో చేయికలపడం ద్వారా ప్రస్తుతం ఈ కంపెనీ 15 లక్షల కోట్ల కంపెనీగా మారింది అయితే ఈఒప్పందం పై అటు అమెజాన్ సంస్థ కానీ ఇటు రిలయన్స్ సంస్థ కానీ అధికారికంగా స్పందించకపోవడంతో ఈవ్యూహం వెనుక కారణాలు ఏమిటి అంటూ పారిశ్రామిక వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: