భారత్ చైనా సరిహద్దుల మధ్య ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉండటంతో చైనా ను వాణిజ్యపరంగా దెబ్బ కొట్టాలని మన కేంద్రప్రభుత్వం చైనా కు చెందిన 177 యాప్ లను నిషేదించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈవిషయంలో చైనాకు మరింత దెబ్బ కొట్టాలని ఆదేశం నుండి దిగుమతి అయ్యే మొబైల్ ఫోన్స్ ను కట్టడి చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నా అది సాధ్యం అయ్యే పరిస్థితి అయ్యేనా అంటూ చర్చలు జరుగుతున్నాయి.


చైనా నుంచి దిగుమతి అయ్యే దిగుమతులలో ఎక్కువ భాగం స్మార్ట్ ఫోన్స్ కావడంతో వాటిని నిషేదిస్తే శాంసంగ్ నోకియా వంటి వాటికి డిమాండ్ పెరుగుతుందని కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఇది సాధ్యం అయ్యే పరిస్థితి కాదు అన్న మరో వాదన వినిపిస్తోంది. ఇప్పుడు చైనా నుండి సెల్ పోన్స్ దిగుమతి పై నిషేధం విధించినా అప్పటికప్పుడు పెద్ద సంఖ్యలో వేరే కంపెనీల ఫోన్స్ ను భారత్ ప్రజల అవసరాల నిమిత్తం సరఫరా చేయడం కష్టం అన్న వాదన కూడ ఉంది.



ప్రస్తుతం భారత్ మొబైల్ మార్కెట్ 16 వేల కోట్లు దరిదాపులో ఉంటే వాటిలో 75 శాతం చైనా మొబైల్ కంపెనీల వాటా అని గణాంకాలు చెపుతున్నాయి. దీనితో తెలివిగా కొన్ని చైనా మొబైల్ కంపెనీలు తమ ఫోన్స్ భారత్ లో తయారు అయినట్లు చెపుతూ తమ కంపెనీల వెబ్ సైట్ దిగువ భాగాన ప్రదర్శిస్తున్న పరిస్థితులలో ఈ ఫోన్స్ దిగుమతి పై వెంటనే నిషేధం విధిస్తే సుమారు 30 వేలమందికి భారత్ లో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది దీనితో చైనా మొబైల్స్ కు ధీటుగా మన ఇండియన్ మొబైల్ కంపెనీలు కూడ మంచి మోడల్స్ తక్కువ ధరలతో అందించినప్పుడు మాత్రమే ఈ చైనా స్మార్ట్ ఫోన్ ల ప్రవాహానికి చాల స్మార్ట్ గా కట్టడి చేయగలమని దీనికోసం చాల ముందు చూపుతో కూడిన వ్యూహాలు అవసరం అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: