ఆగస్టు నెల మొదటి వారం లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన కొన్ని నిబంధనల ప్రకారం, ఎన్ e సి హెచ్ రోజులో 24గంటలూ పని చేస్తోంది.. ఇక ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం జాతీయ అలాగే ప్రైవేట్ బ్యాంకులలో కూడా నియమాలు అమలు చేయబడతాయి. అంటే ఇకపై వారాంతంలో కూడా ప్రజలు తమ చెక్కులను క్లియర్ చేసుకోగలుగుతారు. అంతే కాదు డబ్బు కోసం వారు వారం రోజుల పాటు వేచి ఉండాల్సిన అవసరం కూడా లేదు. అంతే కాదు ఎవరైతే చెక్కును ఉపయోగిస్తున్నారో, అలాంటి వారు కూడా సెలవు రోజుల్లో కూడా చెక్ ను క్లియర్ చేసుకోవచ్చు.

ఏదిఏమైనా ఈ మార్పు ముఖ్యంగా  పని రోజుల్లో ఎవరైతే వారి చెక్కులను క్లియర్ చేసుకునే అలవాటు ఉందో,  ఆ వ్యక్తుల పై ఇది చాలా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా సెలవు దినాల్లో కూడా వారి చెక్కులను క్లియర్ చేసుకోవడానికి పూర్తి అవకాశాలను కల్పించడం జరిగింది. మీ పనులు వేగవంతంగా సాగాలి అంటే, ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాలో కనీసం బ్యాలెన్స్ ను  ఉంచుకోవాలి .అప్పుడే వేగవంతమైన చెక్కు క్లియర్ అవుతుంది అని అధికారులు వెల్లడించారు.

మీ చెక్కు గనక చాలా వేగంగా ప్రాసెస్ చేయబడుతుంది అంటే బౌన్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.అలాంటి  సందర్భాలలో మీరు పెనాల్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీ చెక్ బౌన్స్ కాకుండా ఉండాలి అంటే తప్పకుండా మీ ఖాతాల్లో కనీస మొత్తాన్ని ఎప్పుడూ ఉండేలా చూసుకోవడం అవసరం. వారం చివరి రోజులలో అలాగే సెలవు దినాల్లో కూడా చెక్కులు క్లియర్ చేయబడతాయి కాబట్టి, మీ ఖాతాలో డబ్బులు ఉంచుకోవాలి. ఆర్బీఐ  తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు బ్యాంకింగ్ ప్రక్రియలో ప్రధాన మార్పు  అని చెప్పవచ్చు. ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు అందరికీ చాలా బాగా వర్తిస్తున్నాయి అని కూడా బ్యాంకు కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: