
సాధారణంగా ప్రతి ఒక్కరు జాజికాయ, జాపత్రి అనే పదాలను విని ఉంటారు. కానీ ఆ మసాలా ఎలా పండుతుందో కచ్చితంగా తెలియదనే చెప్పాలి. జాజి కాయ సాగు చేయడం వల్ల మీకు మరింత లాభం వస్తుంది. ఇండోనేషియా, భారతదేశం, తైవాన్, మలేషియా, శ్రీలంక తో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో పెద్ద ఎత్తున పండిస్తున్నారు. ఎండిన జాజికాయ పండ్లను సుగంధ ద్రవ్యాలు, సుగంధ నూనెలు, ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల వాతావరణం వీటి సాగుకు సరైనది. ఈ మొక్క సాగు విషయానికి వస్తే ఈ మొక్క పెద్ద చెట్టుగా పెరగడానికి ఏడు సంవత్సరాల సమయం పడుతుంది. ఒక్కొక్క చెట్టు 20 అడుగుల పొడవు పెరుగుతుంది.
జాజికాయ పండు పియర్ ఆకారంలో ఉంటుంది.. పండు పై పొర పక్వానికి వచ్చిన తర్వాత దాని నుండి లోపల పండును తీసివేసి పై తొక్కను ఎండబెట్టి జాపత్రిగా ఉపయోగిస్తారు. ఐఐఎస్సార్ విశ్వశ్రీ రకం విత్తిన ఎనిమిది సంవత్సరాల తర్వాత పూర్తిగా అభివృద్ధి చెందిన ప్రతి చెట్టు నుండి 1000 పండ్లు హెక్టారుకు 3100 కిలోల దిగుబడిని ఇస్తుంది.. కేల శ్రీరకంలో నాటిన ఆరు సంవత్సరాల ఉత్పత్తి ప్రారంభమవుతుంది.. 25 సంవత్సరాల తర్వాత పూర్తిగా చట్టం అభివృద్ధి చెందుతుంది ..ఇది సంవత్సరానికి 3200 కిలోల ఉత్పత్తిని ఇస్తుంది. నాలుగెకరాల భూమిలో ప్రతి చెట్టు నుండి సంవత్సరానికి 500 కిలోల ఎండిన జాజికాయ లభిస్తుంది. కిలో రూ.500 చొప్పున మీరు అమ్మినట్లయితే మరింత ఆదాయం పొందవచ్చు.