
పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ జిల్లాలో డేరాబాబా నానక్ టౌన్‌కు చెందిన రూపీందర్‌జిత్ సింగ్ ఒక అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లో క్లర్కుగా పనిచేస్తున్నాడు. అందరిలానే బాగా బ్రతకాలని, కోటీశ్వరుడు కావాలని కలలు కనేవాడు. దీని కోసం రూపీందర్‌జిత్ సింగ్ గత ఏడాది నుంచి లాటరీ టికెట్లు కూడా కొంటున్నాడు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నాగాలాండ్ లాటరీ టికెట్లు ఒక్కోటి రూ.6 చొప్పున 25 కొనుగోలు చేశాడు. ఆ తరువాత రోజులానే తన పనిలో బిజీ అయిపోయాడు. అయితే ఒక గంట తరువాత అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ లో మాటలు విన్న రూపీందర్‌జిత్ సింగ్ షాక్ అయ్యాడు. మీరు రూ.కోటి గెలుచుకున్నారు అంటూ రూపీందర్‌జిత్ సింగ్ కు కాల్ వచ్చింది. ఆ మాటలు విన్న రూపీందర్‌జిత్ సింగ్ ఆనందంలో మునిగిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రూపీందర్‌జిత్ సింగ్ కు అభినందనలు తెలిపారు. రూపీందర్‌జిత్ సింగ్ మాట్లాడుతూ ఇదంతా ఒక కలలా ఉందన్నాడు. అంతే కాదు ఈ డబ్బుని కుటుంబ భవిష్యత్తు కోసం, పేదల కోసం ఈ డబ్బు ఖర్చు చేస్తానని చెప్పాడు. ఇప్పుడు డేరా బాబా నానక్ టౌన్ పేరు మరోసారి వైరల్ అవుతుంది. ఎందుకు అనుకుంటున్నారా. గతంలో ఇదే ప్రాంతానికి చెందిన ఓ కిరాణం దుకాణం యజమాని రూ.2.5 కోట్ల లాటరీ గెలిచాడు. ఇప్పుడు మరొకరు కూడా ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కోటీశ్వరుడు కావడంతో ఆ ప్రాంతం వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.