ఇటీవల బజార్ రౌడీ సినిమాకు సంబంధించి ఒక సన్నివేశాన్ని చేయడం కోసం అందులో ఒక స్టంట్ చేయాల్సి వచ్చింది. అయితే ఆ స్టంట్ చేసేటప్పుడు అనుకోకుండా పైనుంచి బైక్ తో సహా కిందకి పడిపోయాడు సంపూర్ణేష్ బాబు. అయితే ఒక్కసారిగా సినిమా యూనిట్ అంతా ఉలిక్కిపడింది. ఆ తర్వాత డాక్టర్ పరిశీలించి ఏం జరగలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా చిత్రం యూనిట్ ఊపిరిపీల్చుకుంది.