శివ సినిమా కథ మొత్తం పూర్తయ్యాక అర్జెంటు పని మీద భరణి ఓ రోజు ఫ్లైట్ ఎక్కి,హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. కానీ అనుకున్న టైం ప్రకారం స్క్రిప్ట్ ని టైంకి పంపాలనే ఉద్దేశంతో, మొత్తం సీల్డ్ కవర్ చేసి, దాన్ని పీవీఎల్ నరసింహారావు తో వర్మకు పంపించాడు భరణి.ఇక అంతే... ఆ రోజు నుంచి భరణి కు ఎలాంటి ఫోన్ కాల్ లేదు. ఇంతలోనే శివ ప్రకటన వచ్చేసింది. కానీ అందులో భరణి పేరు లేదు. ఇక ఈలోగా వర్మ అసిస్టెంట్ గా ఉన్న శివ నాగేశ్వరరావు కాల్ చేసి, చెన్నైలోనే వర్మ ఉన్నాడని, ఫోన్ చేసి మాట్లాడమని సలహా ఇచ్చాడు భరణికి. ఇక వర్మ భరణి ని ఇంటికి పిలిపించి, ఆ సంభాషణలో సారీ కూడా చెప్పాడు. దానికి కారణం కూడా వివరించాడు. దాంతో ఆ రోజు తర్వాత హైదరాబాద్ వచ్చేయమని చెప్పి వెళ్ళిపోయాడు వర్మ . ఇక కథ సుఖాంతం అయి భరణి శివ టీమ్ లోకి వచ్చాడు. నటుడిగా అదరగొట్టేశాడు..