ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షో కి వచ్చిన సురేష్ మాట్లాడుతూ తన సినీ కెరీర్ లో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో విజయశాంతి కి సురేష్ కి మధ్య ఎఫైర్ ఉన్నట్లు రావడంతో వారిద్దరి మధ్య పది సంవత్సరాల పాటు దూరం పెరిగింది. అయితే ఆ 10 సంవత్సరాల తర్వాత అనుకోకుండా ఒక షూటింగ్ లో ఎదురుపడినప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు తొలగి, మంచిగా మాట్లాడుకోవడం మొదలు పెట్టామని సురేష్ వివరణ ఇచ్చారు.