పూర్తిగా తెలుగు ఇండస్ట్రీకి దూరమై, బాలీవుడ్ లోకి తను మాకాం మార్చాలి అనుకుంటున్నాడు. అంతేకాకుండా ఇకపై ముంబైలోనే ఉండిపోవాలి అనుకుంటూ ఉన్నట్లు సమాచారం. ఆది పురుష్ షూటింగ్ అంతా కూడా ముంబైలోనే జరగనుంది. అక్కడే ఒక భారీ స్టూడియోలో సెట్ వేసి పూర్తి చేయనున్నారు దర్శకుడు. ఇక దానితో పాటు సలార్ సబ్జెక్టు కూడా కొంత భాగం ముంబైలోనే జరగనుంది.అంతేకాకుండా ముంబై లో ఒక ఇల్లు కొనుక్కోవాలని కూడా చూస్తున్నట్లు సమాచారం. ముంబై లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రూ.50 కోట్ల వరకూ బడ్జెట్ కేటాయించి, ఒక ఇల్లు కొనాలని ప్రభాస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆది పురుష్ నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ కు ఆ ఇంటి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రభాస్ తెలుగు ఇండస్ట్రీని వీడి, బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి మారబోతున్నాడు