జూనియర్ సుహాసిని మొదటి సినిమాలో హీరోయిన్ గా అవకాశాలు వచ్చినప్పటికీ ఈమెను ప్రేక్షకులు ఆదరించినా, పెద్దగా సినీ ఇండస్ట్రీలో పెద్దగా క్లిక్ కాలేకపోయింది. మొదట జూనియర్ సుహాసిని , బాలాదిత్య హీరోగా పరిచయం అవుతూ, బి.జయ దర్శకత్వంలో వచ్చిన సినిమా "చంటిగాడు" ఈ సినిమా మంచి హిట్ ను సాధించినప్పటికీ తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక తర్వాత తమిళ్, భోజ్ పురి సినిమాలు ఎక్కువగా నటించింది. అయితే కేవలం చిన్న హీరోల సరసన మాత్రమే నటించేందుకు అవకాశం వచ్చింది. అలా అవకాశం లేక సినీ ఇండస్ట్రీకి దూరమై ప్రస్తుతం బుల్లితెరపై బిజీగా ఉంటోంది.