మాధవన్ సవ్యసాచి సినిమా లో విలన్ గా కనిపించాడు. నాని జెంటిల్మెన్ సినిమా లో విలన్ గా కనిపించి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అంతే కాకుండా "వి" సినిమాలో పూర్తి స్థాయి విలన్ గా మెప్పించాడు.అర్జున్ అభిమన్యు, లై సినిమాలో విలన్ గా నటించాడు. రానా బాహుబలి చిత్రంలో విలన్ గా నటించి మెప్పించాడు.జగపతి బాబు రంగస్థలం, నాన్నకు ప్రేమతో సినిమాలలో విలన్ గా నటించి, అందరినీ మెప్పించారు. ఆ తర్వాత అరవింద స్వామి " ధ్రువ" సినిమా లో విలన్ గా నటించాడు. ఇక శ్రీకాంత్ కూడా "యుద్ధం శరణం గచ్ఛామి" సినిమా లో విలన్ గా కనిపించాడు. ఇక కార్తికేయ కూడా ఆర్ఎక్స్ 100 ద్వారా మంచి హిట్ ను కొట్టి, ఆ తర్వాత "గ్యాంగ్ లీడర్" సినిమా లో విలన్ గా మెప్పించాడు..