అల్లు అర్జున్ నటించిన "సరైనోడు " చిత్రం అలాగే అల్లు శిరీష్ నటించిన "ఏ బి సి డి ( అమెరికన్ బార్న్ కన్ఫ్యూషన్ దేశీ )" చిత్రలు గత వారం అత్యధిక టిఆర్పి సాధించిన హిందీ డబ్బింగ్ సినిమాలుగా చరిత్ర సృష్టించాయి. అయితే ఇది ఎలా వచ్చింది అంటే బార్క్ రేటింగ్స్ ఆధారంగా హిందీ ప్రేక్షకులు సరైనోడు,ఏబిసిడి సినిమాలపై ఎక్కువ మక్కువ చూపించారని ఆ రేటింగ్స్ నిరూపించాయి.మొత్తం ఏబిసిడి 4016, సరైనోడు చిత్రానికి 4863 ఆవరేజ్ మినిట్ ఆడియన్స్ వచ్చింది. మరొక రికార్డ్ ఏమిటంటే.. బాహుబలి ది కంక్లూజన్ కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం.. ఎందుకంటే అదే వారంలో బాహుబలి కూడా టీవీలో ప్రసారం అయింది. కేవలం 3609 ఆవరేజ్ మినిట్ ఆడియన్స్ నమోదయింది..