ఇంటర్వ్యూ లో భాగంగానే ఒక యాంకర్ సంపూర్ణేష్ బాబు ను ఇలా అడిగింది. ప్రస్తుతం మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటారు అంట.. నిజమేనా..? అని ప్రశ్నించారు . దీంతో సంపూర్ణేష్ బాబు ఈ విషయంపై స్పందిస్తూ ..నిజమేనని ..తెలిపాడు.. ఇక ఈ క్రమంలోనే ఒక్కోసారి హైదరాబాద్ కు ప్రయాణిస్తుంటాను అని చెప్పుకొచ్చాడు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తానని తెలిపాడు..అయితే తాను ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి ఏమాత్రం నామోషీగా ఫీల్ అవ్వను. అంతేకాక మందితో కలిసి ప్రయాణించడం తనకు చాలా ఇష్టమని , అందువల్లే ఒక్కోసారి కావాలనే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తానని సంపూర్ణేష్ బాబు చెప్పుకొచ్చాడు..