సమంత సినిమాల్లోకి రాక ముందు పలు యాడ్స్ లలో నటించిందట. చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ రంగంపై ఆసక్తి ఉండడంతో ఈ భామ ఆశిక్ టెక్స్టైల్స్ అనే షాపింగ్ మాల్ తరఫున చీరలు కొనుగోలు చేయాలని చెప్పిందట. అప్పటి యాడ్లో ఫోటోలో ఉన్న సమంతాను చూసి అందరూ షాక్ కు గురయ్యారు. అంతేకాకుండా అప్పటికీ ఇప్పటికీ ఆమె అందం లో చాలా మార్పులు వచ్చాయని కామెంట్లు పెడుతున్నారు. ఇదంతా పాకెట్ మనీ కోసమే చేశానని సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే చేతిలో డబ్బులు ఉండాలంటే.. ఏదో ఒక పని చేయాల్సి ఉంది కదా.. అని చెప్పుకొచ్చింది సమంత.